అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lake Restoration | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆక్రమణల తొలగింపుతో పాటు చెరువుల పునరుద్ధరణపై హైడ్రా (Hydraa) ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు చెరువులను అభివృద్ధి చేసి, అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరో నాలుగు చెరువుల పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రారంభించారు.
రంగారెడ్డి (Rangareddy) జిల్లా రాజేంద్రనగర్ మండలం ఇబ్రహీంబాగ్లోని ఇబ్రహీం పెద్ద చెరువు, గండిపేట మండలం పుప్పాలగూడలోని భగీరథమ్మ చెరువు, కూకట్‌పల్లి మండలం మూసాపేటలోని కాముని చెరువుతో పాటు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కాప్రాలోని కాప్రా చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా గురువారం ప్రారంభించింది. ఇబ్రహీం చెరువుతో పాటు, కాముని చెరువుల వద్ద హైడ్రా కమిషనర్ భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు.
Lake Restoration | రూ.107 కోట్లతో..
ఈ నాలుగు చెరువులను రూ.107 కోట్లతో పునరుద్ధరించనున్నారు. కాముని చెరువును 48 ఎకరాలు, ఇబ్రహీం పెద్దచెరువు 97 ఎకరాలు, 54 ఎకరాల్లో భగీరథమ్మ చెరువు, 112 ఎకరాల్లో కాప్రా చెరువును అభివృద్ధి చేస్తున్నారు. మొదట చెరువుల్లో పూడిక తొలగించి, దుర్గంధం పోయేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. వరదల కట్టడితో పాటు.. భూగర్భ జలాలు పెంపు లక్ష్యంగా చెరువులను అభివృద్ధి చేయాలన్నారు. చెరువుచుట్టూ పాత్‌వేలు, అన్ని వయసులవారూ సేదదీరేలా ఏర్పట్లు చేయడంతో పాటు.. ఓపెన్ జిమ్‌లు, పిల్లల ప్లే ఏరియాలు ఇలా ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలన్నారు.
దీనిని కూడా చదవండి : ACB Raids | తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా నగదు స్వాధీనం