అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. నిత్యం దాడులు చేస్తూ లంచాలు తీసుకునే అధికారులను హడలెత్తిస్తున్నారు. తాజాగా ఓ తహశీల్దార్ (సస్పెండెడ్)పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి, ఇంట్లో సోదాలు చేశారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట మండల తహశీల్దార్ (Shamirpet Tahsildar) సుచరిత లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఆమెను మే 26న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నాలా కన్వర్షన్ కోసం రూ.30 లక్షలు డిమాండ్ చేసిన ఆమె.. డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం సుచరితను అధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. సస్పెండ్ అయిన తహశీల్దార్ సుచరితపై ఏసీబీ (ACB) అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.
ACB Raids | బంగారం, వజ్రాలు లభ్యం

ఏసీబీ అధికారులు గురువారం సుచరిత నివాసాల్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో రూ.5.05 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. వీటిలో 3 ఫ్లాట్లు, 2 ప్లాట్లు, వ్యవసాయ భూమి, రూ.12 లక్షల నగదు, రూ.1.2 కోట్ల విలువైన బంగారు, వజ్రా ఆభరణాలు ఉన్నారు. ఆమె పేరిట రూ.38 లక్షల బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, రెండు కార్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో భారీగా ఉంటుందని తెలిపారు. విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : Amazon India Investment | భారత్ లో అమెజాన్ మెగా ప్లాన్.. రూ. 4 లక్షల కోట్లతో భారీ పెట్టుబడులు