అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police | హత్యాయత్నం కేసులో రౌడీషీటర్ అబ్దుల్ సల్మాన్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కామారెడ్డి (Kamareddy) డీఎస్పీ మధుసూదన్ వివరాలు వెల్లడించారు.
Kamareddy Police | ప్రహరీ వివాదంలో..
డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు మహమ్మద్ అర్షద్ ఇంటి ప్రహరీ వివాదానికి సంబంధించిన పాత కక్షల నేపథ్యంలో నిందితుడు ఈనెల 22న రాత్రి అర్షద్ ఇంటికి వెళ్లి ఆటో రిక్షా, విద్యుత్ మీటర్‌ను ధ్వంసం చేశాడు. అనంతరం అర్షద్, అతని భార్యపై రాయితో దాడి చేసి గాయపర్చాడు. తల్వార్‌తో బెదిరించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బతుకమ్మ కుంట వద్ద పారిపోతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించగా, నేరానికి ఉపయోగించిన తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
నిందితుడిపై కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో(Kamareddy Police station) రౌడీషీటర్ నమోదై ఉందని తెలిపారు. గతంలో హత్యాయత్నంతో సహా 5 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. జైలుకు వెళ్లిన చరిత్ర కూడా ఉందని డీఎస్పీ వెల్లడించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు అనుమానాస్పద వ్యక్తుల సమాచారం పోలీసులకు తెలపాలని డీఎస్పీ కోరారు. కేసును ఛేదించిన ఎస్‌హెచ్‌వో నరహరి, ఎస్సై సాయికృష్ణ, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారని తెలిపారు.

ఇది కూడాచదవండి: ‘ఓజీ 2’ స్పెషల్ వీడియో రిలీజ్..