అక్షరటుడే, కామారెడ్డి: District Judge Appointment | జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పి.ముక్తిద నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు (Telangana State High Court) ఉత్తర్వుల మేరకు గురువారం ఆమె బాధ్యలు స్వీకరించారు.
District Judge Appointment | యాదాద్రి భువనగిరిలో పనిచేస్తూ బదిలీపై..
కామారెడ్డి-1 అదనపు జిల్లా న్యాయమూర్తిగా, పోక్సో ప్రత్యేక న్యాయస్థాన న్యాయమూర్తిగా, జిల్లా న్యాయ సేవా సంస్థ ఛైర్‌పర్సన్‌గానూ ఆమె పదవీబాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆమె యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహించి బదిలీపై కామారెడ్డి (Kamareddy) కి వచ్చారు. బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె రామారెడ్డిలోని కాలభైరవ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రధాన జిల్లా న్యాయమూర్తికి న్యాయాధికారులు సూరా సుమలత, సుధాకర్, దీక్ష, ప్రధాన పరిపాలనా అధికారి రాంచందర్ రావు, ఉషారాణి, సిబ్బంది భుజంగరావు, వెంకట్ రెడ్డి, చంద్రసేన్ రెడ్డి, నిఖిల్ రెడ్డి, కరుణ, మమతతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ, ప్రభుత్వ న్యాయవాది శ్యాం గోపాల్ రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, జిల్లా న్యాయ వ్యవస్థ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Urea Supply Review | యూరియాపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ