అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Courts | భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడికి న్యాయస్థానం జీవితఖైదు (Life Imprisonment) విధించింది. ఈ మేరకు నిజామాబాద్ (Nizamabad) నాలుగో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దుర్గాప్రసాద్ తీర్పు వెలువరించారు.
Nizamabad Courts | ఆలూర్ మండలం కల్లెడ గ్రామానికి..
వివరాల్లోకి వెళ్తే.. ఆలూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన గుగులోత్ శంకర్‌కు మొదట వివాహం కాగా.. మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
విడాకుల అనంతరం శంకర్ జక్రాన్‌పల్లికి చెందిన యమునను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి కూతరు జన్మించింది. అయితే యమునకు ఆలూర్ మండలానికి చెందిన నందుతో అక్రమ సంబంధం ఏర్పడింది.
ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో అక్రమ సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని యమున నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మే 7, 2025 న డాబా పైన పడుకున్న సమయంలో వర్షం వస్తుండటంతో కిందికి దిగుతున్న భర్తను యమున వెనుక నుంచి తోసేసింది.
కిందపడి గాయపడిన శంకర్‌ను ఇంట్లోకి తీసుకెళ్లిన యమున.. తన ప్రియుడు నందును ఇంటికెళ్లి పిలుచుకొచ్చింది. ఇద్దరు కలిసి శంకర్ గొంతు నులిమి హత్య చేశారు.
కాగా, ఆమె ప్రవర్తనపై అనుమానంతో మొదటి భార్య కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో యమునను విచారించగా తన ప్రియుడు నందుతో కలిసి శంకర్‌ను హత్య చేసినట్లు ఒప్పుకొంది. సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు నిందితులిద్దరికీ జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.

ఇది కూడా చదవండి: గురుగ్రామ్–ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్లో వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.