అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dr L Ramulu | నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ ఎల్. రాములు పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటి వరకు ఇంఛార్జి హోదాలో విధులు నిర్వర్తించిన డాక్టర్ ఎల్. రాములు, తాజాగా పూర్తి అదనపు (Full Additional) బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
Dr L Ramulu | పరిపాలనా వ్యవహారాల పర్యవేక్షణ
డాక్టర్ ఎల్. రాములు ఆర్థోపెడిక్స్ విభాగాధిపతిగా సేవలు అందిస్తూనే, ఇకపై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పరిపాలనా వ్యవహారాలను కూడా పర్యవేక్షించనున్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో ఆసుపత్రి సేవలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.