July 15 Horoscope | గజకేసరి యోగంతో అఖండ ధన లాభం.. ఈ రాశుల వారికి ఇక దశ తిరిగినట్టే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: July 15 Horoscope | గ్రహాల గమనం, నక్షత్రాల సంచారం కారణంగా ఇవాళ (బుధవారం, జులై 15) చాలా రాశుల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒకవైపు కొందరికి వ్యాపారాలు సజావుగా సాగుతూ ఊహించని లాభాలు తెచ్చిపెట్టనున్నాయి.

మరోవైపు కొన్ని రాశుల వారు మాత్రం అనవసరమైన వాదనలకు, మొండి పట్టుదలలకు దూరంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గజకేసరి యోగం వల్ల కొన్ని రాశుల వారి ఆర్థిక కష్టాలన్నీ తీరి, కొత్త ఆదాయ మార్గాలు లభించనున్నాయి.

July 15 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: July 15 Horoscope | భవిష్యత్తులో మంచి లాభాలను ఇచ్చే వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు ఇవాళ మంచి లాభాలు లభించనున్నాయి. దూరపు బంధువుల నుంచి వచ్చే శుభవార్తతో కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆఫీసులో మీ పనిని సహోద్యోగులు , ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. పని వాతావరణం మీకు చాలా సానుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి: July 15 Horoscope | భాగస్వామితో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. కొన్ని పరిస్థితుల్లో మీ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించండి. తోటి ఉద్యోగులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. ఇదివరకు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వని వారికి మళ్లీ అప్పు ఇవ్వకపోవడమే మంచిది.

మిథున రాశి: July 15 Horoscope | మొండి పట్టుదలని వదిలేసి, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. వరుసగా ఆర్థిక లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఆఫీసులో మీదే పైచేయి అవుతుంది. రాజకీయాలు, వివాదాలను పక్కన పెట్టి పనిపై దృష్టి పెట్టడం మంచిది.

కర్కాటక రాశి: July 15 Horoscope | ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో, పెండింగ్‌లో ఉన్న పాత బిల్లులు, అప్పులను తీర్చివేస్తారు. ఆఫీసులో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఇతరుల సమస్యలు, గొడవలను పట్టించుకుని మీ ప్రశాంతతను పాడుచేసుకోకండి. వయసు పైబడిన వారు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహ రాశి: July 15 Horoscope | ఇవాళ మీరు చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. రోజు గడిచేకొద్దీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తల్లిదండ్రులతో మీ కొత్త ప్రాజెక్టులు, ప్లాన్‌ల గురించి చర్చించడానికి ఇది సరైన సమయం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల మాటలు వినకండి, సొంతంగా నిర్ణయాలు తీసుకోండి.

కన్యా రాశి: July 15 Horoscope | తోబుట్టువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ప్రయాణాల వల్ల ఖర్చు పెరిగినా, అవి ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారం, చదువుల విషయంలో శుభ ఫలితాలు ఉన్నాయి. మంచి పరిచయాలు, పలుకుబడి ఉన్న వ్యక్తుల మద్దతు మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థిక లాభం కోసం భైరవుడిని ఆరాధించడం మంచిది.

తులా రాశి: July 15 Horoscope | ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు వహించండి. భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధి కోసం జీవిత భాగస్వామితో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తారు.

School Kitchen Shed | బడి రుణం.. తమ్ముడి స్మరణం: సిరికొండ జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థి అక్షరార్చన!

పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. మీ హాస్యచతురత ఇవాళ మీకు కలిసి వస్తుంది. బంధువులను కలవడానికి చేసే చిన్న ప్రయాణం మీకు విశ్రాంతిని, ఉపశమనాన్ని ఇస్తుంది.

వృశ్చిక రాశి: July 15 Horoscope | భూమికి సంబంధించిన ముఖ్యమైన వ్యాపార వ్యవహారాల్లో పాల్గొంటారు. కొంతమంది ప్రవర్తన మీకు కోపం తెప్పించవచ్చు, కానీ వాటిని పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిది. అందరినీ ఒకచోటకు చేర్చి, వినోదభరితమైన కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లతో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతారు.

ధనుస్సు రాశి: ఇవాళ మీకు కొన్ని టెన్షన్లు, అభిప్రాయభేదాలు ఎదురవుతాయి. ఆఫీసులో మీ సహోద్యోగులలో ఎవరో ఒకరు మీ విలువైన వస్తువును దొంగిలించే ప్రమాదం ఉంది. మీరు ఊహించిన దానికంటే సోదరుడు మీ అవసరాలకు మరింతగా సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని ఆదుకుంటారు.

మకర రాశి: ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త క్షీణించడం మిమ్మల్ని ఒత్తిడికి, ఆందోళనకు గురిచేయవచ్చు. ఒత్తిడికి గురికావడం వల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఆందోళన, కంగారు మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి.

కుంభ రాశి: ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఊహించని శుభవార్త వింటారు. ఇది కుటుంబం అంతటా ఎంతో సంతోషాన్ని, ఆనంద క్షణాలను నింపుతుంది.

ఉద్యోగంలో వస్తున్న మార్పుల వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. తరుల జోక్యం వల్ల ఇవాళ జీవిత భాగస్వామితో మీకున్న బంధం కాస్త దెబ్బతినే ప్రమాదం ఉంది.

మీన రాశి: ఇవాళ మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.స్థిరపడిన, పేరుపొందిన వ్యాపారవేత్తలు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆఫీసులో, పనిచేసే చోట ఎదురయ్యే వ్యతిరేకతలను తట్టుకోవడానికి కాస్త విచక్షణతో, ధైర్యంతో ముందడుగు వేయండి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *