అక్షరటుడే, వెబ్‌డెస్క్: July 15 Market Analysis | అమెరికా-ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గత సెషన్‌లో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
అయితే బ్యాంకులు, సెమీకండక్టర్ స్టాక్‌లలో లాభాల కారణంగా యూఎస్ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ప్రపంచ మార్కెట్ల నుంచి అందుతున్న సంకేతాలతో బుధవారం ఉదయం మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
July 15 Horoscope | గజకేసరి యోగంతో అఖండ ధన లాభం.. ఈ రాశుల వారికి ఇక దశ తిరిగినట్టే!
July 15 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 0.90 శాతం, ఎస్ అండ్ పీ 0.38 శాతం పెరగ్గా.. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.10 శాతం లాభంతో ఉంది.
July 15 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.13 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.33 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.30 శాతం లాభపడ్డాయి.
July 15 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 6.65 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.67 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.87 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.68 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.57 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.06 శాతం లాభాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.11 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 739 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 2,927 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 85.74 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 57 పైసలు బలహీనపడి 96.20 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.83 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.59 వద్ద ఉన్నాయి.