బిజినెస్​Vivo X300 FE 5G | వీవో నుంచి ప్రీమియం ఫోన్

Vivo X300 FE 5G | వీవో నుంచి ప్రీమియం ఫోన్

వివో మరో మోడల్ తో భారత మార్కెట్ లోకి వచ్చింది. సరికొత్త ఎక్స్ 300 ఎఫ్ఈ మోడల్ ను రిలీజ్ చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vivo X300 FE 5G | చైనా (China)కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ అయిన వీవో భారత మార్కెట్ లోకి మరో కొత్త మోడల్ ను తీసుకువచ్చింది. ఎక్స్ 300 ఎఫ్ఈ పేరుతో విడుదల చేసింది.

స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, 90డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వచ్చిన ఈ మోడల్.. ఈ 14 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఇండియా (Vivo India) ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 6.31 అంగుళాల ఎల్టీపీవో అమోలెడ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే అమర్చారు. ఇది 1,216 x 2,640 పిక్సెల్స్ రిజల్యూషన్ , 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది.

సాఫ్ట్ వేర్ : స్నాప్ డ్రాగన్ 8 జెన్5 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16తో కూడిన ఆరిజన్ ఓఎస్ 6 ఆధారంగా పనిచేస్తుంది. ఐదేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్ లు, ఏడేళ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తామని కంపెనీ చెబుతోంది.

Vivo X300 FE 5G | కెమెరా సెటప్ ..

బ్యాక్ సైడ్ జైస్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స921 ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో స్పెషల్ స్ట్రీట్ ఫొటోగ్రఫీ మోడ్, ఏఐ క్రియేటివ్ మోడ్ వంటి అడ్వాన్స్ డ్ ఫీచర్లున్నాయి.

Vivo X300 FE 5G | బ్యాటరీ సామర్థ్యం..

6,500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 90డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ ను, 40డబ్ల్యూ వైర్‌లెస్ చార్జింగ్ తోపాటు బైపాస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

వేరియంట్స్ : వివో ఎక్స్ 300ఎఫ్ఈ అర్బన్ ఆలివ్, లైలాక్ పర్పుల్, నోయిర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో, రెండు వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది.
12జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.79,999.
12జీబీ, 512జీబీ వేరియంట్ ధర రూ.89,999.
ఎక్స్‌టెండర్ జన్2 లెన్స్ ధర రూ. 15,999, టెలిఫొటో ఎక్స్‌టెండర్ యాక్సెసరీస్ కిట్ రూ.3,999గా నిర్ణయించారు.

కార్డ్ ఆఫర్లు : ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో 10శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనంగా రూ.4 వేల వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది.

ఇది కూడా చదవండి..: TVS iQube S | సరికొత్తగా టీవీఎస్ ఐక్యూబ్ .. 175 కి.మీ రేంజ్ తో విడుదల

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Revanth Reddy Convoy | సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Convoy | ముఖ్యమంత్రి వస్తున్నారంటే...

Stock Market | రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాట.. స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | అమెరికా, ఇరాన్ ల...

Jailer Love Story | ఖైదీతో జైలర్ ప్రేమాయణం.. పెళ్లి పీటలెక్కిన అరుదైన ప్రేమకథ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jailer Love Story | ప్రేమకు సరిహద్దులు...