Coca-Cola IPO | ఐపీవోకు కోకా కోలా.. సెబీకి డీఆర్‌హెచ్పీ సమర్పణ

కోకా కోలా కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రావడానికి సన్నాహాలు చేసుకుంటోంది. దీనికి సంబంధించిన డీఆర్‌హెచ్పీని సెబీకి సమర్పించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Coca-Cola IPO | భారతీయ స్టాక్ మార్కెట్‌లో లిస్టవడం కోసం మరో కంపెనీ సన్నాహాలు చేసుకుంటోంది. దేశీయ ఎఫ్ఎంసీజీ, బెవరేజెస్ రంగంలో గట్టి పట్టు ఉన్న హిందుస్థాన్ కోకా కోలా హోల్డింగ్స్ లిమిటెడ్ (హెచ్‌సీసీహెచ్) మార్కెట్‌నుంచి సుమారు బిలియన్ డాలర్లు సమీకరించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ మేరకు మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది.

Coca-Cola IPO | రిలయన్స్‌నుంచి గట్టి పోటీ..

హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ భారతదేశంలో కోకా కోలా (Coca-Cola) త్పత్తుల బాట్లింగ్, తయారీ, పంపిణీలో నిమగ్నమైన అతిపెద్ద బిజినెస్ యూనిట్. దీనిని 1997లో ఏర్పాటు చేశారు. ఇది కోకా కోలా, థమ్సప్, స్ప్రైట్, ఫాంటా, లిమ్కా, అక్వాఫినా, మజా బ్రాండ్ల తయారీ, మార్కెటింగ్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. కంపెనీకి 10 రాష్ట్రాలలో 14 బాట్లింగ్ ప్లాంట్లున్నాయి. హెచ్‌సీసీహెచ్‌లో జూబిలెంట్ భార్తియా గ్రూప్ నకు 40 శాతం వాటా ఉంది. మిగిలిన 60 శాతం వాటా కోకా కోలా చేతిలో ఉంది. ఇటీవల రిలయన్స్ సైతం ఈ రంగంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆ సంస్థ తక్కువ ధరలో కాంపా కోలాను తీసుకురావడంతో మార్కెట్‌లో కోకా కోలాకు గట్టి పోటీ ఎదురవుతోంది.

Coca-Cola IPO | ఆఫర్ ఫర్ సేల్ ద్వారా..

సెబీకి దాఖలు చేసిన డీఆర్ హెచ్‌పీ ప్రకారం ప్రతిపాదిత ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉండనుంది. అంటే కంపెనీ నూతనంగా షేర్లను జారీ చేయదు. కంపెనీ ప్రధాన ప్రమోటర్ అయిన హిందుస్థాన్ కోకా కోలా ఓవర్సీస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తనకున్న వాటాలోంచి 99.74 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా సుమారు బిలియన్ డాలర్లు సమీకరించనుంది. అంటే పబ్లిక్ ఇష్యూ ద్వారా ఒక్క రూపాయి కూడా కంపెనీకి రాదు. అంతా ప్రమోటర్‌కే వెళ్తుంది. సెబీ నుంచి ఆమోదం లభించిన తర్వాత ఐపీవో తేదీలు, ప్రైస్ బ్యాండ్ ప్రకటించనున్నారు. కంపెనీ షేర్లు 2027లో లిస్టయ్యే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి..: Nov 09 Market Analysis | గ్రీన్‌లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్‌లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *