అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nov 09 Market Analysis | క్రూడ్ ఆయిల్ (Crude oil) ధరలు దిగివస్తుండడం, టెక్ స్టాక్స్ పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్లు పాజిటివ్ గా స్పందిస్తున్నాయి. గత సెషన్లో వాల్‌స్ట్రీట్ పాజిటివ్ గా ముగియగా.. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) సైతం లాభాల బాటలో ఉన్నాయి. మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది.
Nov 09 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్ 1.09 శాతం, ఎస్ అండ్ పీ 0.32 శాతం లాభపడ్డాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.58 శాతం నష్టంతో ఉంది.
Nov 09 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.95 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.82 శాతం నష్టపోగా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ ఫ్లాట్‌గా ముగిసింది.
Nov 09 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 5.45 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 3.36 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.80 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.72 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.34 శాతం లాభంతో కదలాడుతున్నాయి. సింగపూర్ మార్కెట్లకు సెలవు. గిఫ్ట్ నిఫ్టీ 0.39 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు సైతం గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్నాయి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఆరు సెషన్ల తర్వాత నికర అమ్మకందారులుగా మారారు. గత సెషన్లో నికరంగా రూ. 0.25 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.
- డీఐఐలు చాలాకాలం తర్వాత వరుసగా ఏడో సెషన్లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. రూ. 700.31 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 57 పైసలు బలపడి 93.91 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 102.15 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.88 శాతం వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.47 నుంచి 1.28 కు పడిపోయింది.
- విక్స్ 5.53 శాతం పెరిగి 18.43 వద్ద ఉంది. ఇది ఈ ఏడాది మే 20వ తేదీ తర్వాత గరిష్టం. మార్కెట్లో అస్థిరతను సూచిస్తోంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 97.57 డాలర్ల వద్ద ఉంది.