అక్షరటుడే, వెబ్‌డెస్క్ : NSE IPO | ఎన్ ఎస్ ఈని 1992లో స్థాపించారు. ఇది 1993 ఏప్రిల్ లో సెబీ ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా గుర్తింపు పొందింది. ఎన్ ఎస్ ఈ తన కార్యకలాపాలను 1994లో ప్రారంభించింది. మొదట హోల్‌సేల్ డెట్ మార్కెట్‌తో మొదలై.. ఆ తర్వాత స్టాక్ కొనుగోలు మరియు అమ్మకాల మార్కెట్‌గా విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగిన విశ్వసనీయమైన మార్కెట్ సంస్థగా నిలుస్తోంది.
NSE IPO | అతిపెద్ద డెరివేటివ్స్ మార్కెట్‌గా..
ఎన్ ఎస్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ మార్కెట్లలో ఒకదానిగా ఎదిగింది. ఇక్కడ ఇండెక్స్‌లు, స్టాక్‌లు, ఇతర సెక్యూరిటీలపై ఆప్షన్స్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ జరుగుతుంది. ఇది అన్ని రకాల పెట్టుబడిదారులకు ట్రేడింగ్ మరియు పెట్టుబడి అవకాశాలను కల్పిస్తోంది.
ఆర్థిక పరిస్థితి : 2025లో రూ. 19,176.83 కోట్ల ఆదాయం సమకూరగా.. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 18,713.37 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో లాభం సైతం రూ. 12,187.69 కోట్లనుంచి రూ. 10,302.06 కోట్లకు తగ్గింది.
NSE IPO | రూ. 22,561.57 కోట్ల ఐపీవో..
కంపెనీ సుమారు రూ. 22,561.57 కోట్లను సమీకరించనుంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో జరగనుంది. రూ. 1 ముఖ విలువ కలిగిన 12,64,36,650 ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనున్నారు. గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద కంపెనీ విలువను రూ. 4.42 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.
ధరల శ్రేణి : కంపెనీ షేర్ల ప్రైస్‌బ్యాండ్‌ను రూ. 1,700 నుంచి రూ. 1,785గా నిర్ణయించింది. ఒక లాట్ లో 8 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,280 తో బిడ్ వేయాల్సి ఉంటుంది. గరిష్టంగా 14 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు.
కోటా : ఐపీవో (IPO)లో క్యూఐబీ కోటా 50 శాతం, రిటైల్ కోటా 35 శాతం, ఎన్ఐఐ కోటా 15 శాతంగా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ పబ్లిక్ ఇష్యూ సెప్టెంబరు 17న ప్రారంభమవుతుంది. 21వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అవకాశం ఉంటుంది. షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ 22న రాత్రి వెలువడే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు 24 న బీఎస్ఈలో లిస్ట్ అవుతాయి.
జీఎంపీ : అతిపెద్ద ఐపీవో కావడంతో దీనికి గ్రే మార్కెట్ ప్రీమియం నామమాత్రంగా ఉంది. ఒక్కో షేరుకు రూ. 208 జీఎంపీ ఉంది. అంటే ఐపీవో అలాట్ అయితే లిస్టింగ్ సమయంలో 11 శాతం వరకు మాత్రమే లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Losses | పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు