Global Markets Mixed | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Global Markets Mixed | ప్రధాన గ్లోబల్ మార్కెట్లు(Global Markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గత సెషన్‌లో యూఎస్ స్టాక్ మార్కెట్ లాభాలతో, యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Global Markets Mixed | యూఎస్ మార్కెట్లు..

సెమీకండక్టర్ షేర్లలో లాభాల కారణంగా గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్(Wallstreet) లాభాలతో ముగిసింది. నాస్‌డాక్ 1.91 శాతం, ఎస్ అండ్ పీ 1.08 శాతం లాభపడగా.. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.19 శాతం నష్టంతో ఉంది.

Global Markets Mixed | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.37 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.44 శాతం పెరగ్గా.. యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.18 శాతం నష్టపోయింది.

Global Markets Mixed | ఆసియా మార్కెట్లు..

Global Markets Mixed

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 2.32 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.62 శాతం లాభాలతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.62 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.44 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.43 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.40 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 1,025 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.
  • డీఐఐలు వరుసగా 23వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,516 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.10 నుంచి 1.12 కు పెరిగింది.
  • విక్స్ 3.91 శాతం తగ్గి 12.67 వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు బలపడి 94.33 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.83 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.46 వద్ద ఉన్నాయి.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 79.53 డాలర్ల వద్ద ఉంది.

ఇది కూడా చదవండి..: FCNR Deposit Rates | ఎన్నారైలకు గుడ్ న్యూస్.. ఎఫ్.సి.ఎన్.ఆర్ డిపాజిట్లపై వడ్డీని భారీగా పెంచిన ఉజ్జీవన్ బ్యాంక్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *