Microsoft AI Super App | ఓపెన్‌ఏఐకి గట్టి పోటీ.. మైక్రోసాఫ్ట్‌ నుంచి సూపర్‌ ఏఐ యాప్‌

ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Microsoft AI Super App | ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా సరికొత్త ఏఐ సూపర్‌ యాప్‌ను తీసుకురానున్నట్లు సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు.

Microsoft AI Super App | కోపైలట్ నుంచి సూపర్‌ యాప్‌గా..

సాధారణ చాట్‌బాట్ స్థాయి నుంచి కోపైలట్ చాలా వేగంగా అభివృద్ధి చెంది, ఇప్పుడు సరికొత్త ‘సూపర్‌ యాప్‌’ రూపును సంతరించుకుంటోందని సత్య నాదెళ్ల తెలిపారు. ఇది తమ కంపెనీకి కీలకమైన మైలురాయి అని అభివర్ణించారు. ఈ యాప్‌ ద్వారా సాధారణ ఏఐ యాప్‌లతో చేసే పనుల కంటే ఎంతో సులభంగా మరిన్ని పనులు పూర్తి చేసుకోవచ్చని వివరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

Microsoft AI Super App | మైక్రోసాఫ్ట్ ఆదాయం..

ఇదే సమావేశంలో మైక్రోసాఫ్ట్ ఆర్థిక విజయాలను సత్య నాదెళ్ల పంచుకున్నారు. Microsoft AI Super Appఈ సంవత్సరం కంపెనీ వార్షిక ఆదాయం 331 బిలియన్ డాలర్లకు పైగా చేరింది. ఇందులో ఒక్క క్లౌడ్ వ్యాపారం నుంచే 214 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. జూన్‌ 30తో ముగిసిన త్రైమాసికానికి నికర ఆదాయం 35.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. మైక్రోసాఫ్ట్ సంపాదించిన ఈ ఆదాయం దాదాపు ఈజిప్ట్ దేశ జీడీపీకి సమానంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Microsoft AI Super App | చరిత్రలోనే సరికొత్త రికార్డు లాభాలు..

మరోవైపు దక్షిణ కొరియా టెక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ కంపెనీ తన చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా భారీ నిర్వహణ లాభాన్ని నమోదు చేసింది. ఈ సారి మొత్తం 62 బిలియన్ డాలర్ల లాభం వచ్చినట్లు ప్రకటించింది. ఈ పరిణామంతో దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ సూచీ ‘కోస్పి’ గురువారం ఒక్కసారిగా పుంజుకుని దాదాపు 4 శాతానికి పైగా లాభాలను నమోదు చేసింది.

ఇది కూడా చదవండి:  CRPF Chief | నిర్భయంగా పని చేయండి.. నేను చూసుకుంటా: సీఆర్​పీఎఫ్​ చీఫ్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *