తెలంగాణPOCSO Allegations | కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. కేటీఆర్...

POCSO Allegations | కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. కేటీఆర్ సంచలన ట్వీట్!

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.

అక్షరటుడే వెబ్‌డెస్క్: POCSO Allegations| కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తప్పు చేసిన కొడుకును కాపాడుతున్న కేంద్ర మంత్రి తీరు అత్యంత హేయమని ఆయన ధ్వజమెత్తారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.

POCSO Allegations | ప్రభుత్వ వైఖరిపై నిలదీత..

ఒక మైనర్ బాలిక తల్లిదండ్రులు స్వయంగా వచ్చి ఫిర్యాదు చేసినా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉండటంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏమీ తెలియనట్టు నటిస్తూ, నిందితులకు పరోక్షంగా సహకరిస్తోందని ఆరోపించారు. పోక్సో వంటి సీరియస్ కేసులో సర్కార్ అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.

POCSO Allegations | మీడియా మౌనంపై ఆగ్రహం..

ఇంతటి ఘోరమైన నేరం జరిగినా, ఆ వార్తను రిపోర్ట్ చేయకుండా తొక్కిపెడుతున్న తెలుగు మీడియాపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. బాధితుల పక్షాన నిలబడాల్సిన మీడియా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం, మీడియా.. ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ నీచంగా వ్యవహరిస్తున్నారో చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు.

 

ఇది  కూడా చదవండి: Modi Hyderabad Visit | హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. చంద్రబాబు, పవన్ నివాసాలకు ప్రత్యేకంగా వెళ్లి భేటీ కానున్నారా..!

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Vijay Welfare Schemes| ముఖ్యమంత్రిగా విజయ్ తొలి అడుగు.. ఉచిత విద్యుత్, ఫ్రీ బస్ ప్రయాణంపై తొలి సంతకాలు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Vijay Welfare Schemes| తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన...

Tractor Tyre Blast | ట్రాక్టర్ టైర్​ పేలి​.. నలుగురికి గాయాలు

అక్షరటుడే, ఆర్మూర్​: Tractor Tyre Blast | ట్రాక్టర్ టైర్ పేలి(tractor...

Inter Admissions | య‌థావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు.. సీఎం కీలక ఆదేశాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Admissions | ఇంటర్​ ప్రవేశాలపై సీఎం...

Royal Enfield Brand | ‘బుల్లెట్’ స్పీడ్​తో పైపైకి.. ప్రపంచంలోనే 3వ స్ట్రాంగెస్ట్ ఆటో బ్రాండ్​గా గుర్తింపు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Royal Enfield Brand | ప్రముఖ భారతీయ ద్విచక్ర...