INDIA Alliance Meeting | ప్రతి రెండు నెలలకోసారి ‘ఇండియా’ కూటమి సమావేశాలు: మల్లికార్జున ఖర్గే

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: INDIA Alliance Meeting | ప్రతిపక్షాల ‘ఇండియా’ (INDIA) కూటమి ఇకపై ప్రతి రెండు నెలలకోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తదుపరి కీలక భేటీని ఆగస్టు 8న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. అయితే, ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి సోషల్ మీడియాలో ‘ఇండియా’ కూటమి సమావేశాలపై సరికొత్త చర్చ నడుస్తోంది.

INDIA Alliance Meeting | కూటమి సమావేశాలు కలిసి రావడం లేదా?

‘ఇండియా’ కూటమి సమావేశాలు ఆయా ప్రాంతీయ పార్టీల నేతలకు అరిష్టాన్ని తెచ్చిపెడుతున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. గతంలో 2023లో జరిగిన కూటమి సమావేశాల తర్వాత మహారాష్ట్రలో సీనియర్ నేత శరద్ పవార్ తన సొంత పార్టీ (ఎన్సీపీ)పైనే నియంత్రణ కోల్పోవాల్సి వచ్చింది. ఆయన పార్టీ రెండుగా చీలిపోయి అజిత్ పవార్ చేతిలోకి వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
kharg

 

INDIA Alliance Meeting | మమతా బెనర్జీ విషయంలోనూ..

తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విషయంలోనూ అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయని, శరద్ పవార్ తరహాలోనే నేడు దీదీ విషయంలోనూ చరిత్ర పునరావృతమైందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి భేటీలు జరిగినప్పుడల్లా అందులోని భాగస్వామ్య పక్షాలకు ఏదో ఒక రాజకీయ సంక్షోభం ఎదురవుతోందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 8న హైదరాబాద్‌లో జరగబోయే తదుపరి సమావేశంపై అందరి దృష్టి పడింది.

ఇది కూడా చదవండి:  E85 Fuel | ఆ ఇంధనంతో.. లీటర్‌పై రూ. 20 ఆదా!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *