Bandi Sanjay Dismissal|కేంద్రమంత్రి బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్‌ చేయాలి: కేటీఆర్‌

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Bandi Sanjay Dismissal|కేంద్రమంత్రి బండి సంజయ్‌ను మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బూత్ స్థాయి ప్రతినిధుల (BLAs) శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

Bandi Sanjay Dismissal|నిందితుడిని దాచింది కేంద్రమంత్రే..

ఒక బాలికకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాజీపడే ప్రయత్నం చేశాయని కేటీఆర్ ఆరోపించారు. కానీ, బాధితురాలికి న్యాయం జరగాలని బీఆర్‌ఎస్ పార్టీ, దాని అనుబంధ సంఘాలు గట్టిగా పోరాడాయని, ఆ ఒత్తిడి వల్లే ఇప్పుడు కొంతవరకు న్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పే ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అనే మాటలు కేవలం నినాదాలకే పరిమితం కాకూడదని కేటీఆర్ విమర్శించారు. కేంద్రమంత్రి కుమారుడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ అయ్యే పరిస్థితి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. తప్పు చేసిన తన కుమారుడిని తొమ్మిది రోజుల పాటు దాచిపెట్టి, బాధితురాలి తల్లిదండ్రులను భయపెట్టింది స్వయంగా కేంద్రమంత్రేనని కేటీఆర్ ఆరోపించారు.

Bandi Sanjay Dismissal|పదవిలో ఉంటే విచారణ సరిగా జరగదు..

బండి సంజయ్ కేంద్రమంత్రి పదవిలో కొనసాగితే ఈ కేసు విచారణ సజావుగా సాగదని, కాబట్టి ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉండటం తెలంగాణకే కాకుండా, దేశానికే అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Yadadri Power Plant Fire|యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెద్ద ముప్పు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *