Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

TMC Bank Accounts | మమతా బెనర్జీకి షాక్.. రూ. 804 కోట్ల ఫండ్స్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన నాలుగు బ్యాంక్ ఖాతాల సీజ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Shivam nagarani
Last updated: October 1, 2026, 5:29 pm 5:29 pm
Shivam nagarani
Share
TMC Bank Accounts

అక్షరటుడే వెబ్‌డెస్క్: TMC Bank Accounts | మమతా బెనర్జీ  ( Mamata Banerjee )నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన నాలుగు బ్యాంక్ ఖాతాల సీజ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఖాతాల సీజ్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రూ. 804 కోట్లు ఉన్న బ్యాంక్ అకౌంట్ల ఫ్రీజ్‌‌ను ఎత్తివేయడానికి మధ్యంతర ఉపశమనం అందించేందుకు నిరాకరిస్తూ కలకత్తా హైకోర్టు ఆగస్టు 27న ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ పి.బి. వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

TMC Bank Accounts | హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేం..

పార్టీ గుర్తు వివాదం ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) వద్ద పెండింగ్‌లో ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కారణంగానే కలకత్తా హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అయితే ఈ కేసుకు సంబంధించి మెరిట్స్ జోలికి మాత్రం వెళ్లడం లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

TMC Bank Accounts | పార్టీ కార్యకలాపాలు స్తంభించాయి..

ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ తరఫున సీనియర్ న్యాయవాది ఏ.ఎం. సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయడం ద్వారా పార్టీ రాజకీయ కార్యకలాపాలను అడ్డుకునే యత్నం జరుగుతోందని ఆరోపించారు. త్వరలో జరగనున్న ఉపఎన్నికల నేపథ్యంలో పార్టీ నిర్వహణ ఖర్చుల నిమిత్తం నెలకు కనీసం రూ. 12.15 కోట్లు అవసరమని తెలిపారు. దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎఐటిసికి ( AITC ) ప్రాథమిక రాజకీయ కార్యకలాపాలకే ఈ నిధులు అత్యవసరమని, ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేకుండానే రాష్ట్ర పోలీసులు ఖాతాలను నిలిపివేశారని వాదించారు.

TMC Bank Accounts | ప్రభుత్వ వాదన..

మమతా వర్గం అభ్యర్థనను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్రంగా వ్యతిరేకించారు. రెండు వర్గాలు తామే అసలైన తృణమూల్ అని దావా వేస్తున్నాయని, ఈ వివాదాన్ని పరిష్కరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు కోరిందని గుర్తుచేశారు. ఎన్నికల గుర్తును ఈసీఐ ఫ్రీజ్ చేసినందున, అసలైన పార్టీ ఏదో తేలేవరకు బ్యాంక్ ఖాతాలను ఎవరు నిర్వహించాలనేది నిర్ణయించలేమని తెలిపారు.

అలాగే, టీఎంసీ ప్రధాన కార్యదర్శి పర్సనల్ సెక్రటరీ సుమిత్ రాయ్ రోడ్లపై సేకరించిన రూ. 35 కోట్ల నగదును ఈ ఖాతాల్లో జమ చేసినట్లు దర్యాప్తులో తేలిందని మెహతా కోర్టుకు వివరించారు. మునుపటి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి సంపాదించిన అక్రమ సొమ్మునే ఇందులో జమ చేశారని, దీనిపై ముమ్మర విచారణ జరుగుతోందని తెలిపారు. దసరా సెలవుల తర్వాత ఈ అంశంపై కలకత్తా హైకోర్టు విచారణ జరపనుందని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  Danam Nagender Votes | హైదరాబాద్‌ను తగలబెడతాం.. దానం నాగేందర్ సంచలన హెచ్చరిక

 

TAGGED:Bank Account FreezeCalcutta High Courtlatest newsMamata BanerjeeSupreme Courttelugu newsTMC Bank AccountsTMC CaseTrinamool CongressWest Bengal politics
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article KTR Revanth Reddy KTR Revanth Reddy | దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ సవాల్
Next Article Hindu Puja Rituals Hindu Puja Rituals | గుడి నుంచి నేరుగా ఇంటికే వెళ్లాలి అంటారు.. ఎందుకో తెలుసా?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

PMAY Urban 2.0
జాతీయం

PMAY Urban 2.0 | మోదీ మీ ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు ఇస్తున్నారు… త్వరపడండి

By Shivam nagarani
Akshaya Thanga Maligai
బిజినెస్​

Akshaya Thanga Maligai | తమిళనాడు టార్గెట్‌గా కళ్యాణ్ జ్యూవెలర్స్ కొత్త బ్రాండ్.. ‘అక్షయ తంగ మాలిగై’ ఆవిష్కరణ

By Shivam nagarani
Mukesh Ambani Salary
జాతీయం

Mukesh Ambani Salary | ఆరేళ్లుగా వేతనమే లేదు.. అయినా ప్రపంచ కుబేరుల్లో 21వ స్థానం..

By Srinivas Kolluri
BHIM UPI Growth
జాతీయం

BHIM UPI Growth | యూపీఐ యాప్స్‌లో దూసుకెళ్తున్న ‘భీమ్’.. రెండేళ్లలో పది రెట్లు పెరిగిన లావాదేవీలు

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.