PMAY Urban 2.0 | మోదీ మీ ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు ఇస్తున్నారు… త్వరపడండి

పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేద, మధ్యతరగతి కుటుంబాల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0’ (PMAY-U 2.0) పథకాన్ని అమలు చేస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: PMAY Urban 2.0 | పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేద, మధ్యతరగతి కుటుంబాల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0’ (PMAY-U 2.0) పథకాన్ని అమలు చేస్తోంది. అద్దె ఇళ్లల్లో కాలం వెళ్లదీస్తూ సొంత గూడు కట్టుకోవాలనుకునే వారికి ఈ పథకం చక్కటి భరోసా కల్పిస్తోంది. దాదాపు కోటి కుటుంబాలకు పక్కా ఇళ్లు అందించడమే లక్ష్యంగా రూ.10 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ బృహత్తర కార్యక్రమం సాగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా రూ.2.30 లక్షల కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది.

PMAY Urban 2.0 | పక్కా ఇళ్లే లక్ష్యం..

పట్టణాల్లో  ( City ) పెరుగుతున్న జనాభా, సొంతింటి కలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది. కేవలం ఇల్లు కొనేవారికో లేదా కట్టుకునేవారికో మాత్రమే కాకుండా, అద్దె ఇళ్లల్లో ఉండే వారికి సైతం ఇందులో ప్రత్యేక అవకాశాలు కల్పించారు. లబ్ధిదారులు తమ అవసరం, ఆర్థిక స్థితిని బట్టి ఇల్లు కట్టుకోవడం, కొనుగోలు చేయడం లేదా సరసమైన ధరల్లో అద్దె ఇంట్లో ఉండటం అనే వేర్వేరు మార్గాలను ఎంచుకునే వీలుంది.

PMAY Urban 2.0 | స్థలం ఉన్నా, లేకపోయినా ..

పట్టణ  ( ప్రాంతాల్లో మీకు సొంత స్థలం ఉండి, ఇల్లు కట్టుకోవడానికి తగినంత డబ్బు లేకపోతే ఈ పథకం ద్వారా రూ.1.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఒకవేళ అసలు స్థలమే లేకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రభుత్వం ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్య సంస్థలతో కలిసి చౌకైన ఇళ్లను నిర్మిస్తుంది. ఈ మోడల్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కుటుంబాలకు ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షల వరకు కేంద్రం సాయం అందిస్తుంది. దీనివల్ల స్థలం లేని వారికి కూడా సొంతింటి కల నెరవేరుతుంది.

PMAY Urban 2.0 | భారీ వడ్డీ సబ్సిడీ..

సొంతంగా ఇల్లు కొనుగోలు చేయడానికి హోమ్ లోన్ తీసుకునే వారి కోసం ప్రభుత్వం అద్భుతమైన వడ్డీ సబ్సిడీ సదుపాయాన్ని కల్పించింది. రూ.8 లక్షల వరకు పొందే హోమ్ లోన్‌పై ఏడాదికి 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. దీని ద్వారా లబ్ధిదారులు గరిష్టంగా రూ.1.80 లక్షల వరకు ఆర్థిక లబ్ధి పొందవచ్చు.

PMAY Urban 2.0 | అర్హత వివరాలు..

ఉద్యోగాలు, పనుల కోసం నగరాలకు వచ్చే వలసదారులు, పారిశ్రామిక కార్మికులు, ఉద్యోగిణులు, పేదల కోసం తక్కువ అద్దెకే లభించే అఫోర్డబుల్ రెంటింగ్ హౌసింగ్ వసతిని కూడా ఇందులో పొందుపరిచారు. ఈ ప్రయోజనాలు పొందడానికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని మూడు కేటగిరీలుగా విభజించారు.ఇందులో వార్షిక ఆదాయం రూ. 3 లక్షల వరకు ఉన్న కుటుంబాలు తొలి కేటగిరీలో ఉండగా, రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వార్షిక ఆదాయం గలవారు రెండో కేటగిరీకి వస్తారు. అలాగే, వార్షిక ఆదాయం రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు ఉన్న కుటుంబాలు మూడో కేటగిరీ కింద ఈ పథకానికి అర్హత పొందుతాయి. పట్టణాల్లో నివసిస్తూ సొంతింటి కల కంటున్నవారు తమ ఆదాయ అర్హతలను సరిచూసుకుని, తమకు తగిన ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఈ పథకం ఫలాలను పూర్తిగా పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Nagpur Bank Robbery | బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం చల్లి దోపిడీ

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *