అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Losses | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో శుక్రవారం ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. ఇంట్రాడేలో బ్యారెల్ ధర 109 డాలర్లను టచ్ చేసి తర్వాత తగ్గింది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. బలహీనమైన ప్రపంచ మార్కెట్లను అనుసరిస్తూ దేశీయ మార్కెట్లూ నష్టాల బాటలో పయనించాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్‌తోపాటు మెటల్ , మైనింగ్ స్టాక్స్ ప్రధాన సూచీలను వెనక్కి లాగాయి.
Stock Market Losses | వాల్యూ బయ్యింగ్..
కనిష్టాల వద్ద సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో మధ్యాహ్నం 1.45 గంటల తర్వాత మార్కెట్లు కోలుకుని పైకి ఎగబాకాయి. సెన్సెక్స్ రోజు కనిష్టం 750 పాయింట్లకు పైగా పెరిగింది. ఐటీ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లు నష్టాలను పూడ్చుకోవడానికి దోహదపడ్డాయి. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్లు కోలుకోవడానికి ఒక కారణంగా భావిస్తున్నారు.
Stock Market Losses | భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభం..
దేశీయ మార్కెట్లు (Domestic markets) శుక్రవారం భారీ నష్టాýతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 593 పాయింట్ల గ్యాప్ డౌన్ లో ప్రారంభమై మరో 149 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో 753 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 207 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 39 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 217 పాయిట్లు పైకి ఎగబాకింది. చివరలో మార్కెట్లు కొంత ఒత్తిడికి లోనయ్యాయి. చివరికి సెన్సెక్స్ 120 పాయింట్ల నష్టంతో 74,781 వద్ద, నిఫ్టీ 79 పాయింట్ల నష్టంతో 23,398 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,854 కంపెనీలు లాభపడగా 2,471 స్టాక్స్ నష్టపోయాయి. 234 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 137 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 185 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 11 స్టాక్ లాభపడగా.. 19 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.02 శాతం, టెక్ మహీంద్రా 1.38 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.85 శాతం, ఎటర్నల్ 0.78 శాతం, ఇన్ఫోసిస్ 0.64 శాతం లాభపడ్డాయి.
Top Losers : టాటా స్టీల్ 1.67 శాతం, రిలయన్స్ 1.33 శాతం, సన్‌ఫార్మా 1.18 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.13 శాతం, ఎన్టీపీసీ 1.10 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధరలు పైపైకి.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు