Stock Market Gains | రోజంతా లాభాల్లోనే.. రూ. 3.55 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

Shashi kiran Mottala
April 28 Market Analysis

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Stock Market Gains | అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలపై సందిగ్ధత ఉన్నా క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గడంతో మార్కెట్లు పాజిటివ్‌గా కదలాడాయి. దేశీయ స్టాక్ మార్కెట్‌ (Domestic Stock Market)లోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతుగా నిలవడంతో సూచీలు భారీగా పెరిగాయి.

మంగళవారం ఉదయం సెన్సెక్స్ 97, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించాయి. మొదట్లో కొంత ఒడిదుడుకులకు లోనయినా తర్వాత కోలుకుని పైపైకి దూసుకువెళ్లాయి. చివరికి సెన్సెక్స్ 753 పాయింట్ల లాభంతో 79,273 వద్ద, నిఫ్టీ 211 పాయింట్ల లాభంతో 24,576 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,531 కంపెనీలు లాభపడగా 1,760 స్టాక్స్ నష్టపోయాయి. 162 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 153 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 23 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 3.55 లక్షల కోట్లు పెరిగింది.

Stock Market Gains | క్యాపిటల్ గూడ్స్, ఫార్మా మినహా..

దేశీయ స్టాక్ మార్కెట్ లో క్యాపిటల్ గూడ్స్, ఫార్మా రంగాలు మినహా.. మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్‌లు పాజిటివ్‌గా ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ ఎంసీజీ 2.55 శాతం, రియాలిటీ ఇండెక్స్ 2.14 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.39 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.32 శాతం, టెలికాం 1.14 శాతం, మీడియా 0.97 శాతం లాభపడగా.. ఫార్మా 0.08 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.06 శాతం నష్టపోయాయి.

Stock Market Gains

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 23 స్టాక్స్ లాభపడగా.. 7 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ట్రెంట్ 3.55 శాతం, హెచ్ యూఎల్ 3.13 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.29 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.28 శాతం, హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్ 2.04 శాతం లాభపడ్డాయి.

Top Losers : బీఈఎల్ 1.33 శాతం, టైటాన్ 0.88 శాతం, రిలయన్స్ 0.66 శాతం, ఎన్టీపీసీ 0.45 శాతం, పవర్‌గ్రిడ్ 0.39 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Kia Syros 2026 | కియా సైరోస్.. నయా లుక్!

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *