Indian Stock Market | లాభాల్లో ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం మిశ్రమంగా ప్రారంభమైంది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 465 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Stock Market | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. సౌదీ అరేబియా నుంచి రవాణా పుంజుకుంటుందనే ఆశలతో ముడి చమురు ధరలు దిగివస్తుండడంతో మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఏడు సెషన్‌ల తర్వాత విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా మారడం, గ్లోబల్ క్యూస్ పాజిటివ్‌గా ఉండడంతో దేశీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సైతం మెరుగుపడింది.

Indian Stock Market | మిక్స్‌డ్ గా ప్రారంభం..

దేశీయ మార్కెట్లు (Domestic markets) సోమవారం మిక్స్‌డ్ గా ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 241 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 252 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 333 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా కోలుకుని 80 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి 96 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 465 పాయింట్ల లాభంతో 74,760 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 23,403 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 26 స్టాక్స్ లాభాలతో, 4 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 3.77 శాతం, హెచ్సీఎల్ టెక్ 2.36 శాతం, ఆసియన్ పెయింట్ 2.21 శాతం, సన్‌ఫార్మా 2.20 శాతం, ఐటీసీ 1.79 శాతం లాభాలతో ఉన్నాయి.

Losers : ఎయిర్‌టెల్ 1.64 శాతం, ఇన్ఫోసిస్ 1.32 శాతం, పవర్‌గ్రిడ్ 0.96 శాతం, అదానీ పోర్ట్స్ 0.91 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Sep 21 Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *