Hero Motors IPO | ఐపీవోకు హీరో మోటార్స్.. 16నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

హీరో మోటార్స్ ఐపీవో వచ్చింది. వెయ్యి కోట్ల రూపాయలు సమీకరించనుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hero Motors IPO | హీరో మోటార్స్ లిమిటెడ్ అనేది ఆటో విడిభాగాల తయారీ సంస్థ. ఇది భారత్‌తోపాటు అమెరికా, యూరప్ వంటి దేశాల్లోని గ్లోబల్ వాహన తయారీ సంస్థలకు పవర్‌ట్రెయిన్ సొల్యూషన్స్‌ను రూపొందించి సరఫరా చేస్తుంటుంది. బైక్‌లు, ఈ-బైక్‌లు, కార్లు, ఆఫ్ రోడ్ వాహనాలు, ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ కార్లు, భారీ వాహనాలు మరియు ఈవీటీవోఎల్ విమానాల వంటి వివిధ రకాల వాహనాలకు దీని ఉత్పత్తులను వాడుతున్నారు.

Hero Motors IPO | ఆర్థిక పరిస్థితి..

కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,111.23 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2026 నాటికి ఇది రూ. 1,216.74 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ. 32.80 కోట్ల నుంచి రూ. 41.17 కోట్లకు చేరింది. కంపెనీ ఆస్తులు రూ. 1,164.62 కోట్లనుంచి రూ. 1,371.83 కోట్లకు పెరిగాయి.

Hero Motors IPO | వెయ్యి కోట్ల ఐపీవో..

హీరో మోటార్స్ లిమిటెడ్ మార్కెట్ నుంచి వెయ్యి కోట్ల రూపాయలను సమీకరించాలన్న లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఇందులో కొత్త షేర్ల జారీ ద్వారా రూ.600 కోట్లు, 10 ముఖ విలువ కలిగిన 4,76,19,047 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించడం ద్వారా రూ. 400 కోట్లు సమీకరించనున్నారు. ఐపీవో (IPO) ద్వారా సమకూరిన నిధులను కంపెనీ తీసుకున్న రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించడం కోసం, సామర్థ్య విస్తరణ కోసం, ఇతర వ్యూహాత్మక కార్యక్రమాలు మరియు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నారు.

ధరల శ్రేణి : ఒక్కో షేరు ధరను రూ.79 నుంచి రూ. 84గా కంపెనీ నిర్ణయించింది. ఒక లాట్‌లో 178 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,952 వేలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల కోసం బిడ్లు వేయవచ్చు.

కోటా : క్యూఐబీ కోటా 50శాతం, రిటైల్ కోటా 35 శాతం, మరియు ఎన్ఐఐ కోటా 15శాతం కేటాయించారు.

జీఎంపీ : హీరో మోటార్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 24 గా ఉంది. అంటే ఐపీవో అలాట్ అయిన వారికి లిస్టింగ్ సమయంలో 28 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

ముఖ్యమైన తేదీలు : కంపెనీ ఐపీవో సెప్టెంబర్ 16న ఓపెన్ అవుతుంది. 18వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్ గడువు ఉంది. 21న రాత్రి షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు 23న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవుతాయి.

ఇది కూడా చదవండి..: iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రో ప్రీ-బుకింగ్స్ షురూ.. క్రోమాలో ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *