బిజినెస్​Tech Layoffs 2026 | ఏఐ ఎఫెక్ట్‌తో టెక్ రంగంలో భారీ లేఆఫ్స్.. ఐదు నెలల్లో...

Tech Layoffs 2026 | ఏఐ ఎఫెక్ట్‌తో టెక్ రంగంలో భారీ లేఆఫ్స్.. ఐదు నెలల్లో 92 వేల ఉద్యోగాలు మాయం

2026 సంవత్సరం టెక్ ఉద్యోగులకు కఠిన స‌మ‌యంగా మారింది. కేవలం ఐదు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 92 వేల మందికి పైగా టెక్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tech Layoffs 2026 | ప్రపంచ టెక్నాలజీ రంగంలో 2026 సంవత్సరం తీవ్ర కలకలం రేపుతోంది. కరోనా సమయంలో భారీగా నియామకాలు చేపట్టిన టెక్ దిగ్గజాలు ఇప్పుడు ఖర్చుల నియంత్రణ, ఆటోమేషన్, ఏఐ ఆధారిత వ్యవస్థలపై దృష్టి పెట్టడంతో ఉద్యోగాల కోతలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి.

ఈ ఏడాది ఇప్పటివరకు వివిధ టెక్ కంపెనీల్లో దాదాపు 92,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ నెల టెక్ రంగానికి అత్యంత దారుణమైన నెలగా నిలిచింది. ఒక్క నెలలోనే 45 వేల మందికి పైగా ఉద్యోగులను కంపెనీలు తొలగించాయి. గత రెండేళ్లలో ఇదే అత్యధిక లేఆఫ్స్‌గా (Lay offs) మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Tech Layoffs 2026 | ఖర్చుల నియంత్రణను కారణంగా..

ఈ జాబితాలో అగ్రగామిగా నిలిచింది మెటా ప్లాట్‌ఫామ్స్‌ (Meta Platforms). ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా ఏప్రిల్ 22న దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది సంస్థ మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతం. అంతేకాదు, మరో 6,000 ఖాళీలను కూడా భర్తీ చేయకుండా నిలిపివేసింది. అయితే ఇదే సమయంలో సంస్థ ఏఐ అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇక స్నాప్ కూడా 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ సీఈఓ మాట్లాడుతూ, తమ కోడింగ్ పనిలో 65 శాతానికి పైగా ఏఐ సాంకేతికతే నిర్వహిస్తోందని, అందువల్ల చిన్న బృందాలతోనే ఎక్కువ పనిని పూర్తి చేయగలుగుతున్నామని తెలిపారు.

మైక్రోసాఫ్ట్ (Microsoft) మాత్రం మరో మార్గాన్ని ఎంచుకుంది. తమ 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా అమెరికాలోని సీనియర్ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగి వయస్సు, సర్వీస్ కలిపి 70 ఏళ్లు దాటిన వారికి ఈ అవకాశం కల్పించింది. ఇక అమెజాన్ (Amazon) దాదాపు 30 వేల కార్పొరేట్ ఉద్యోగాలను దశలవారీగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఒరాకిల్ కార్పొరేష‌న్ భారత్, అమెరికా, కెనడాలోని ఉద్యోగులకు ఉదయాన్నే టర్మినేషన్ మెయిల్స్ పంపి విమర్శలకు గురైంది. అలాగే బ్లాక్ ఇంక్ కూడా భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. సంస్థ సుమారు 40 శాతం సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం. అంటే దాదాపు 4,000 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

Tech Layoffs 2026 | టెక్ ఉద్యోగుల్లో ఆందోళన..

ఈ పరిణామాల వెనుక ప్రధాన కారణంగా ఏఐ విప్లవాన్ని నిపుణులు చెబుతున్నారు. ఓపెన్ ఏఐ (OpenAI) రూపొందించిన చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్, ఇతర ఆధునిక సాంకేతికతలు అనేక పనులను ఆటోమేట్ చేస్తున్నాయి. దీంతో మానవ వనరుల అవసరం తగ్గుతోందని కంపెనీలు భావిస్తున్నాయి. ఇది తాత్కాలిక పరిస్థితి కాదని, భవిష్యత్తులో ఉద్యోగాల స్వరూపాన్నే మార్చే శాశ్వత మార్పుల ప్రారంభమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టెక్ ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. ఉద్యోగ భద్రతపై నమ్మకం తగ్గిపోవడంతో చాలామంది ఉద్యోగ మార్పులకు కూడా వెనుకంజ వేస్తున్నారు. మార్కెట్ విశ్లేషణ సంస్థ గ్లాస్‌డోర్ ప్రకారం, టెక్ ఉద్యోగుల ఆత్మవిశ్వాసం ప్రస్తుతం 47.2 శాతానికి పడిపోయింది. మార్కెట్‌లోని అనిశ్చితిని ఆసరాగా చేసుకుని కంపెనీలు మరింత కఠినమైన పనితీరు సమీక్షలు, లేఆఫ్స్ అమలు చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..: May 12 Gold Rates | బంగారం, వెండి ధ‌ర‌ల ఊగిసలాట.. Modi వ్యాఖ్యల ప్రభావమా..?

 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana Cabinet Meeting | 21న రాష్ట్ర కేబినెట్ సమావేశం..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Cabinet Meeting | రాష్ట్ర మంత్రివర్గ...

Tamil Nadu CM Vijay | తమిళనాడు సీఎం విజయ్​ సంచలన నిర్ణయం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamil Nadu CM Vijay | తమిళనాడు...

AIADMK Split | బిగ్ బ్రేకింగ్‌: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్‌కు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AIADMK Split | తమిళనాడు రాజకీయాల్లో కీలక...

Street Dog Attack | హైదరాబాద్​లో దారుణం.. బాలుడిపై 10 వీధికుక్కల దాడి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Street Dog Attack | హైదరాబాద్​ (Hyderabad)లో...