అక్షరటుడే, వెబ్‌డెస్క్: May 12 Gold Rates | దేశీయ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు Gold Rates మరోసారి స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,52,120 వద్ద కొనసాగుతుండగా, నిన్నటి ధర రూ.1,52,234గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,440 వద్ద ట్రేడవుతుండగా, నిన్న ఇది రూ.1,39,640గా ఉంది. వెండి ధర కూడా కాస్త తగ్గుముఖం పట్టి ప్రస్తుతం కిలో రూ.2,74,800 వద్ద కొనసాగుతోంది.
ఇటీవల హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ “బంగారం కొనొద్దు” అంటూ చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యల తర్వాతి రోజే గోల్డ్‌కు సంబంధించిన షేర్లు భారీగా కుప్పకూలాయి. దీంతో బంగారం ధరల్లో కూడా మరింత మార్పులు రావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
May 12 Gold Rates | దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..
హైదరాబాద్‌లో Hyderabad 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,120గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,39,440గా ఉంది. వెండి కిలో ధర రూ.2,85,100గా నమోదైంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,120గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,39,440గా కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,120 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,39,440గా ఉంది.
బెంగళూరులో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం రూ.1,52,120, 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,39,440గా ట్రేడవుతోంది. కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,120 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,39,440గా నమోదైంది.
చెన్నైలో మాత్రం ఇతర నగరాలతో పోలిస్తే ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,810గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,990గా కొనసాగుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,52,270గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,590 వద్ద ట్రేడవుతోంది.
May 12 Gold Rates | Silver Rates
వెండి ధరల Silver Rates విషయానికి వస్తే దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,74,800గా ఉండగా, హైదరాబాద్‌లో మాత్రం ఇది రూ.2,85,100 వరకు ఉంది. మార్కెట్‌లో కొనసాగుతున్న హెచ్చుతగ్గుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశముందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
May 12 Market Analysis | నెగెటివ్‌గా గిఫ్ట్ నిఫ్టీ.. నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

