May 12 Market Analysis | నెగెటివ్​గా గిఫ్ట్ నిఫ్టీ.. నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 12 Market Analysis | అమెరికా, ఇరాన్ ల మధ్య చర్చల విషయంలో అనిశ్చితి కొనసాగుతున్నా ఏఐపై ఆశావాదంతో గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్, యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ డిస్కౌంట్‌తో ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు కూడా నష్టాలతో మొదలుకానున్నాయి.

May 12 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.10 శాతం, ఎస్ అండ్ పీ 0.19 శాతం పెరిగాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.05 శాతం నష్టంతో ఉంది.

May 12 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.35 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.05 శాతం లాభంతో ముగియగా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.70 శాతం నష్టపోయింది.

May 12 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ 0.57 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.33 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.10 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.01 శాతం లాభాలతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.30 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.18 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.46 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా ఐదో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 8,437 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా పదకొండో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 5,939 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.93 నుంచి 0.76 కి తగ్గింది.
  • విక్స్ 10.17 శాతం పెరిగి 18.55 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 105.26 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.11 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.43 వద్ద ఉన్నాయి.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 83 పైసలు బలహీనపడి 95.31 వద్ద ఉంది.
  • నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.

Trump China Visit | చైనాపై ట్రంప్ ప్రశంసలు.. షీ జిన్‌పింగ్‌ను గౌరవనీయ నేతగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *