Mumbai Water Cut | ముంబయిలో నీటి సంక్షోభ హెచ్చరిక.. మే 15 నుంచి 10 శాతం నీటి కోత

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mumbai Water Cut | దేశ ఆర్థిక రాజధాని ముంబయి Mumbai లో నీటి కొరత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. నగరానికి తాగునీటిని సరఫరా చేసే సరస్సుల్లో నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో Brihanmumbai Municipal Corporation (బీఎంసీ) కీలక ప్రకటన చేసింది.

Mumbai Water Cut | అత్యవసర అవసరాలకే పరిమితం

బీఎంసీ చీఫ్ పీఆర్‌వో వెల్లడించిన వివరాల ప్రకారం, నగరవాసులు నీటిని అత్యవసర అవసరాలకే పరిమితం చేసి జాగ్రత్తగా వినియోగించాలని అధికారులు సూచించారు. సరస్సుల్లో నిల్వలు తక్కువగా ఉండటంతో మే 15వ తేదీ నుంచి ముంబయి వ్యాప్తంగా 10 శాతం నీటి కోత అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం వేసవి తీవ్రత మరింతగా పెరగడం, వర్షాలు ఆలస్యమయ్యే అవకాశాల ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నీటి వృథాను నివారించాలని, ఇందుకు పౌరులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నీటి కోత ప్రభావం గృహాలు, హోటళ్లు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలపై పడే అవకాశం ఉంది. దీంతో నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు నీటి వినియోగంపై కట్టుదిట్టమైన నియంత్రణలు కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Trump China Visit | చైనాపై ట్రంప్ ప్రశంసలు.. షీ జిన్‌పింగ్‌ను గౌరవనీయ నేతగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *