అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Rally | వరుసగా నాలుగు సెషన్ల పతనమైన తర్వాత పెట్టుబడిదారులు పడిపోయిన స్టాక్‌లను కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ బలంగా పుంజుకుంది. ముడి చమురు ధరలు కాస్త శాంతించడం, కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్ మినహా మిగిలిన అర్ని రంగాల సూచీలు లాభాలతో ముగిశాయి.
Stock Market Rally | ఒడిదుడుకుల మధ్య పయనం..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం నష్టాలతో కొత్త వారాన్ని ప్రారంభించింది. సెన్సెక్స్ 133 పాయింట్ల గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై మరో 476 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 76 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 137 పాయింట్లు తగ్గింది. అయితే కనిష్టాల వద్ద వాల్యూ బయ్యింగ్‌తో ప్రధాన సూచీలైన సెన్సెక్స్ 1,092 పాయింట్లు, నిఫ్టీ 366 పాయింట్లు పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 482 పాయింట్ల లాభంతో 73,606 వద్ద, నిఫ్టీ 153 పాయింట్ల లాభంతో 22,753 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,420 కంపెనీలు లాభపడగా 2,005 స్టాక్స్ నష్టపోయాయి. 251 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 58 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 517 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 25 కంపెనీలు లాభాలతో, 5 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అదానీపోర్ట్స్ 2.72 శాతం, ఎటర్నల్ 2.56 శాతం, కొటక్ బ్యాంక్ 2.53 శాతం, ట్రెంట్ 1.73 శాతం, టాటా స్టీల్ 1.52 శాతం పెరిగాయి.
Losers : బజాజ్ ఫైనాన్స్ 0.76 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.56 శౄతం, మారుతి 0.52 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.42 శాతం, పవర్‌గ్రిడ్ 0.24 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: iPhone Duo Screen Cracks | ఐఫోన్ డ్యూయో యూజర్లకు షాక్.. కొన్న కొన్ని గంటల్లోనే పగిలిపోతున్న ఫోల్డబుల్ స్క్రీన్లు!