అక్షరటుడే వెబ్‌డెస్క్: iPhone Duo Screen Cracks | యాపిల్ చరిత్రలోనే తొలిసారిగా మార్కెట్లోకి వచ్చిన బుక్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ (iPhone Duo) వినియోగదారులకు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. స్టోర్ నుంచి కొనుగోలు చేసిన కొద్ది గంటల్లోనే ఫోన్ ఇన్నర్ డిస్ప్లేలు పగిలిపోతుండటంతో టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
iPhone Duo Screen Cracks | సెటప్ పూర్తికాకముందే..
మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త ఐఫోన్ డ్యూయో ఫోన్లను కొనుగోలు చేసిన పలువురు కస్టమర్లు తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఫోన్ ఇనిషియల్ సెటప్ కూడా పూర్తి కాకముందే స్క్రీన్ మధ్యలో పగుళ్లు వస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా మడిచే ప్రాంతంలో (Crease) డిస్ప్లే దెబ్బతినడంతో పాటు నిలువుగా, అడ్డంగా పచ్చటి లైన్లు (Green Lines) కనిపిస్తున్నాయని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. ఫోన్ మడిచే సమయంలో హింజ్ బిగుసుకుపోవడంతో, బలవంతంగా ఫోల్డ్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు స్క్రీన్ పగిలిపోతోందని పలువురు వాపోయారు.
iPhone Duo Screen Cracks | సంచలన విషయాలు ..
ఈ డిస్ప్లేల సమస్యపై ప్రముఖ డివైజ్ రిపేర్ నిపుణుల సంస్థ ‘ఐఫిక్సిట్’ (iFixit) విశ్లేషిస్తూ కీలక విషయాలను వెల్లడించింది. ఫోన్ డిస్ప్లే మధ్యలో ఉండే సపోర్ట్ బార్ కొద్దిగా పక్కకు జరగకపోవడం వల్ల ఫ్లెక్సిబుల్ స్క్రీన్‌పై విపరీతమైన ఒత్తిడి పడి పగుళ్లు ఏర్పడుతున్నాయని అంచనా వేసింది. అలాగే ఈ ఫోల్డబుల్ టైటానియం హింజ్ నిర్మాణం కూడా సంక్లిష్టంగా ఉండటం మరొక కారణమని టెక్ నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ‘జెర్రీరిగ్ ఎవ్రీథింగ్’ (JerryRig Everything) చేసిన డ్యూరబిలిటీ టెస్ట్‌లోనూ ఈ ఫోన్ వెనక్కి వంచినప్పుడు స్క్రీన్ పగిలిపోవడం నెట్టింట వైరల్‌గా మారింది.
iPhone Duo Screen Cracks |ఉచితంగా డిస్ప్లే ..
స్క్రీన్ల పగుళ్ల సమస్య తీవ్రం కావడంతో ఆపిల్ సంస్థ స్పందించినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను ఎదుర్కొన్న బాధితులకు ఆపిల్ అధికారిక స్టోర్లలో ఉచితంగానే కొత్త డిస్ప్లేలను మార్చి రీప్లేస్మెంట్ అందిస్తున్నారని సమాచారం.
ఇది కూడా చదవండి: Rahul Gandhi Defamation Case | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట