Stock Market Rally | వాల్యూ బయ్యింగ్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Rally | అమెరికా, చైనాల మధ్య చర్చలు పశ్చిమాసియా వివాదానికి స్నేహపూర్వక పరిష్కారం దిశగా సాగే అవకాశాలు ఉన్నాయన్న ఆశాభావంతో గ్లోబల్ మార్కెట్లు (Global Markets) పాజిటివ్ గా స్పందించాయి. దీంతో గత నాలుగైదు రోజులుగా అమ్మకాల ఒత్తిడితో కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్.. రిలీఫ్ ర్యాలీని చూసింది. వాల్యూ బయ్యింగ్ తో బెంచ్ మార్క్ సూచీలు ఒక శాతానికిపైగా పెరిగాయి.

Stock Market Rally | లాభాలతో ప్రారంభమై..

బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ (Nifty) గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 339 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 132 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 553 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 118 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 59 పాయింట్లు లాభపడింది. అక్కడి నుంచి 163 పాయింట్లు కోల్పోయింది. 11 గంటల తర్వాత సూచీలు వీ షేప్ లో రికవరీ అయ్యాయి. ఇంట్రాడే కనిష్టాలనుంచి సెన్సెక్స్ 1,155 పాయింట్లు, నిఫ్టీ 351 పాయింట్లు పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 789 పాయింట్ల లాభంతో 75,398 వద్ద, నిఫ్టీ 277 పాయింట్ల నష్టంతో 23,689 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Rally | ఐటీ, ఎనర్జీ రంగాలు మినహా..

ఐటీ, ఎనర్జీ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ టెలికాం ఇండెక్స్ 2.87 శాతం, ఫార్మా 2.74 శాతం, మెటల్ 2.04 శాతం, యుటిలిటీ 1.59 శాతం పెరగ్గా.. ఐటీ 1.99 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.19 శాతం నష్టపోయాయి.

Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ ఈలో నమోదైన కంపెనీలలో 2,107 కంపెనీలు లాభపడగా 2,076 స్టాక్స్ నష్టపోయాయి. 190 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 114 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 53 కంపెనీలు 56 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 5 ýక్షల కోట్ల మేర పెరిగింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 23 స్టాక్ లాభపడగా.. 7 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎయిర్‌టెల్ 5.32 శాతం, ఎటర్నల్ 3.32 శాతం, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 2.67 శాతం, అదానీపోర్ట్స్ 2.14 శాతం, సన్‌ఫార్మా 2.12 శాతం లాభపడ్డాయి.

Top Losers : టెక్ మహీంద్రా 2.16 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.63 శాతం, ఇన్ఫోసిస్ 2.46 శాతం, టీసీఎస్ 1.18 శాతం, హెచ్యూఎల్ 0.84 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Vivo X300 Ultra | ఫొటోగ్రఫీ లవర్స్ కోసం.. వీవోనుంచి మరో ఫోన్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *