తెలంగాణBandi Bhagirath POCSO Case | భగీరథ్ పోక్సో కేసులో ట్విస్ట్​.. బాధితురాలి వయసుపై కోర్టులో...

Bandi Bhagirath POCSO Case | భగీరథ్ పోక్సో కేసులో ట్విస్ట్​.. బాధితురాలి వయసుపై కోర్టులో సంచలన వాదనలు!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణ తెలంగాణ హైకోర్టులో కొనసాగుతోంది.

అక్షరటుడే వెబ్‌డెస్క్:Bandi Bhagirath POCSO Case|కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణ తెలంగాణ హైకోర్టులో కొనసాగుతోంది. భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం, మధ్యంతర బెయిల్‌పై తన నిర్ణయాన్ని రేపటికి (శుక్రవారం) వాయిదా వేసింది. అదేవిధంగా, ముందస్తు బెయిల్ పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

Bandi Bhagirath POCSO Case|వయసుపైనే ప్రధాన వాదనలు..

విచారణ సందర్భంగా భగీరథ్ తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. పోలీసుల చార్జిషీట్‌లోని లోపాలను ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2021లో డ్రైవింగ్ తనిఖీల్లో పట్టుబడినప్పుడు బాధితురాలి వయసు 15 ఏళ్లుగా ఉందని, ఇప్పటికీ పోలీసులు ఆమె వయసును 15 ఏళ్లుగానే చూపించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సాంకేతికంగా ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.

Bandi Bhagirath POCSO Case|పాన్ కార్డు వివరాల ప్రస్తావన..

బాధితురాలి వయసు విషయంలో పోలీసుల రికార్డులకు, ఆమె పాన్ కార్డులో ఉన్న వివరాలకు పొంతన లేదని నిరంజన్ రెడ్డి వాదించారు. పుట్టిన తేదీల విషయంలో స్పష్టత లేని అంశాన్ని పరిగణనలోకి తీసుకొని తన క్లయింట్‌కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు. బాధితురాలి వయసుపై పోలీసులు రేపు వెరిఫికేషన్ చేపట్టాలని సూచించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, మధ్యంతర ఉపశమనంపై శుక్రవారం తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Voter List Revision| మూడో దశ ఎస్‌ఐఆర్‌ షురూ.. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో ఓటర్ల వివరాల ధృవీకరణ

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hantavirus Vaccine Delay|పదేళ్ల క్రితమే రావాల్సిన ‘హంటా’ టీకా ఎందుకు రాలేదు? దీని వెనుక షాకింగ్ మిస్టరీ ఇదే!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Hantavirus Vaccine Delay|ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న హంటా వైరస్‌కు (Hantavirus)...

Nizamabad Ring Road | నగరానికి రింగ్​ రోడ్డు కేటాయించకపోవడం దురదృష్టకరం: ఎమ్మెల్యే ధన్​పాల్​

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Ring Road | నిజామాబాద్ నగరానికి రింగ్...

NEET Paper Leak | నీట్ పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..

అక్షరటుడే, కామారెడ్డి: NEET Paper Leak | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన...

Pamula Vagu Bridge | వంతెన నిర్మించలేనందుకు బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే రాజీనామా చేయాలి

అక్షరటుడే, లింగంపేట: Pamula Vagu Bridge | మండలంలో (lingampet) వంతెన...