అక్షరటుడే, లింగంపేట: Pamula Vagu Bridge | మండలంలో (lingampet) వంతెన నిర్మించలేనందుకు బాధ్యతగా ఎమ్మెల్యే రాజీనామా చేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో పాముల వాగు వంతెన వద్ద గురువారం నిరసన చేపట్టారు.
Pamula Vagu Bridge | గతేడాది వర్షాలకు..
ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ.. మండలంలోని లింగంపల్లి కుర్దు (Lingampalli Kurdu) వద్ద గతేడాది కురిసిన భారీ వర్షాలకు పాముల వాగు వంతెన తెగిపోయిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వంతెన నిర్మించకపోవడంతో తాత్కాలిక వంతెనతో వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు (MLA Madan Mohan Rao) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Pamula Vagu Bridge | 45 రోజుల పాటు నిలిచిన రవాణా..
లింగంపల్లి కుర్దు గ్రామంలోని మల్లారం చెరువు కట్ట తెగిపోయి కేకేవై రహదారిపై పాముల వాగు వంతెన కొట్టుకుపోగా.. 45 రోజుల పాటు రవాణా నిలిచిపోయిందన్నారు. ఎల్లారెడ్డి (Yellareddy), లింగంపేట, పిట్లం (Pitlam), బిచ్కుంద తదితర మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అనేక ఇబ్బంది పడ్డారన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు వంతెనకు ఎలాంటి నిధులు మంజూరు కాకపోవడంతో ఈ ఏడాది మళ్లీ రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని లేనిపక్షంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఉద్దేశ్, విష్ణు, సంగీత, సుభాష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Bandi Bhagirath POCSO Case| భగీరథ్ పోక్సో కేసులో ఊహించని మలుపు.. బాధితురాలి వయసుపై కోర్టులో సంచలన వాదనలు!


