RTC Bus Accident | లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. నలుగురికి గాయాలు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: RTC Bus Accident | ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటన దేవునిపల్లి (Devunipalli) సర్కిల్​లోని పొందుర్తి శివారులో జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది.

RTC Bus Accident | పొందుర్తి శివారులో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందుర్తి శివారులో రోడ్డు పక్కన ఓ లారీ పార్క్​ చేసి ఉంది. అయితే హైదరాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పొందుర్తి శివారులో జాతీయ రహదారిపై ఈ ఆగిఉన్న లారీని ఢీకొంది. దాంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో బస్సులో ముందు భాగంలో కూర్చున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం జీజీహెచ్​కు తరలించారు. ఘటనాస్థలాన్ని కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, ఎస్సై రంజిత్ కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Double Engine Sarkar | తెలంగాణాలోనూ త్వరలో ‘డబుల్​ ఇంజిన్​ సర్కార్​’ : దినేష్​ కులాచారి

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *