నిజామాబాద్Double Engine Sarkar | తెలంగాణాలోనూ త్వరలో ‘డబుల్​ ఇంజిన్​ సర్కార్​’ : దినేష్​ కులాచారి

Double Engine Sarkar | తెలంగాణాలోనూ త్వరలో ‘డబుల్​ ఇంజిన్​ సర్కార్​’ : దినేష్​ కులాచారి

తెలంగాణాలోనూ త్వరలో ‘డబుల్​ ఇంజిన్​ సర్కార్​’ రాబోతుందని బీజేపీ నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అక్షరటుడే, ఇందూరు: Double Engine Sarkar | తెలంగాణాలోనూ త్వరలో ‘డబుల్​ ఇంజిన్​ సర్కార్​’ రాబోతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి (dinesh kulachari) అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Double Engine Sarkar | 10న మోదీ సభను విజయవంతం చేయాలి

ఈ సందర్భంగా దినేష్​ కులాచారి మాట్లాడుతూ.. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్నారన్నారు. మే 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మోదీ బహిరంగ సభకు (narendra modi rally) ఇందూరు జిల్లా నుంచి ఎంపీ అర్వింద్​ ఆధ్వర్యంలో సుమారు 15వేల మంది అభిమానులు, కార్యకర్తలు తరలి వెళ్లనున్నారన్నారు.

Double Engine Sarkar | పశ్చిమ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి తరహాలోనే..

పశ్చిమ బెంగాల్ (West Bengal), అస్సాం(Assam), పాండిచ్చేరి (Puducherry) తరహాలోనే తెలంగాణలో కూడా ‘డబుల్ ఇంజన్ సర్కార్’ ఉంటేనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఒక్కో ఇంటికి రూ.1,60,000తో పాటు ఈజీఎస్ కింద మరో రూ.60,000.. మొత్తంగా రూ.2,20,000 అందిస్తోందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న కాంగ్రెస్​ ప్రభుత్వం తన వంతుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్రం నేరుగా సర్పంచుల ఖాతాల్లో వేస్తున్న నిధులను, రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా ఖాళీ అవ్వడంతో అక్రమంగా ఫ్రీజ్ చేసి మళ్లించుకుంటోందని దుయ్యబట్టారు.

Double Engine Sarkar | రేవంతుద్దీన్​ ప్రభుత్వం భయపడుతోంది..

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలను చూసిన ప్రస్తుత రేవంతుద్దీన్ ప్రభుత్వం భయపడుతోందని దినేష్​ వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడానికి వెనుకాడుతోందన్నారు. 2016లో కేవలం మూడు సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో కార్యకర్తల కష్టంతో 2026 నాటికి 200 పైచిలుకు సీట్లు ఎలా సాధించామో, తెలంగాణలో కూడా ప్రస్తుతం ఉన్న 8 సీట్ల నుంచి వచ్చే ఎన్నికల్లో 80 కాదు.. ఏకంగా సెంచరీ సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Double Engine Sarkar | చారిత్రాత్మక సభకు జిల్లా నుంచి..

ఈ చారిత్రాత్మక బహిరంగ సభకు నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని దినేష్ పటేల్ కులాచారి పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ప్రమోద్ కుమార్, నాయిడి రాజన్న, బద్దం కిషన్, పుట్ట వీరేందర్, బీలోజి నాయక్, అనంతరెడ్డి, పడాల భూపతి, అంబదాస్ రావు, పసునూరి రమేష్, ఇప్పాకాయల కిషోర్, యాదాల నరేష్, అమంద్ విజయ్ కృష్ణ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: CPI Letter Governor | సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించాల్సిందే.. గవర్నర్‌కు సీపీఐ బహిరంగ లేఖ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Revanth Reddy Convoy | సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Convoy | ముఖ్యమంత్రి వస్తున్నారంటే...

Stock Market | రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాట.. స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | అమెరికా, ఇరాన్ ల...

Jailer Love Story | ఖైదీతో జైలర్ ప్రేమాయణం.. పెళ్లి పీటలెక్కిన అరుదైన ప్రేమకథ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jailer Love Story | ప్రేమకు సరిహద్దులు...

Fogging Mist Machines | ట్రాఫిక్​ సిబ్బంది కోసం ఐల్యాండ్స్​​ వద్ద ఫాగింగ్​ మిస్ట్​ యంత్రాలు: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Fogging Mist Machines | వేసవికాలంలో ట్రాఫిక్​...