Paddy Procurement | రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Paddy Procurement | ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (Yellareddy MLA Madan Mohan Rao) అధికారులను హెచ్చరించారు. గురువారం ఆయన కామారెడ్డి(kamareddy) పట్టణంలోని ఆర్అండ్​బీ గెస్ట్ హౌస్​లో వరిధాన్యం కొనుగోలు, మిల్లింగ్, రవాణా తదితర అంశాలపై సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు.

Paddy Procurement | రైతుల సమస్యలపై చర్చ

ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఎమ్మెల్యే విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. కొనుగోలు కేంద్రాల ఆలస్యం, తేమ శాతం పేరుతో ధాన్యం తిరస్కరణ, తూకంలో అవకతవకలు, గన్ని బ్యాగుల కొరత ప్రధాన సమస్యలుగా గుర్తించారు. టోకెన్, స్లాట్ వ్యవస్థలో లోపాల కారణంగా రైతులు రోజులు తరబడి వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. అధికారులు, మిల్లర్లు, రవాణా వ్యవస్థ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ధాన్యం సేకరణ, లోడింగ్ ప్రక్రియలో ఆలస్యం జరుగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Paddy Procurement | రైతులపై అదనపు ఖర్చుల భారం

లారీలు సమయానికి అందుబాటులో లేకపోవడం, మిల్లర్ల వద్ద జాప్యం రైతులకు అదనపు ఖర్చులను మోపుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా సమయానికి చెల్లింపులు అందకపోవడం, ఆన్‌లైన్ నమోదు సమస్యలు, క్వాలిటీ చెకింగ్​లో లోపాలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. మధ్యవర్తుల ప్రభావం, వర్షాల కారణంగా ధాన్యం నష్టం కూడా రైతుల్లో ఆందోళన కలిగిస్తున్న అంశాలుగా చర్చించారు. ఈ నేపథ్యంలో రైస్ మిల్లర్లు(Rice Millers), ట్రాన్స్‌పోర్టర్లు, అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని ఎమ్మెల్యే హెచ్చరించారు. రైతులకు సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధు మోహన్, సివిల్ సప్లై, మార్కెటింగ్, డీఆర్డీవో, మార్కెటింగ్, వ్యవసాయ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Hanumantha Rao Appointment | ప్రభుత్వ సలహాదారుగా వీహెచ్‌ నియామకం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *