అక్షరటుడే, నందిపేట్: Nandipet CCTV Cameras | సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల గ్రామాలు కట్టుదిట్టమైన నిఘాలో (Nizamabad Police) ఉంటాయని ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు. మండలంలోని వన్నెల్(కే) గ్రామంలో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు ‘మన ఊరు – మన భద్రత – మన బాధ్యత’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Nandipet CCTV Cameras | 11 సీసీ కెమెరాల ఏర్పాటు..
‘మన ఊరు – మన భద్రత – మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. వాటి పనితీరును గ్రామస్థులకు ఎస్సై వివరించారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని.. బ్యాంకు వివరాలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పవద్దన్నారు.
Nandipet CCTV Cameras | డ్రంకన్ డ్రైవ్ కేసులో ఐదుగురికి జైలు..
నందిపేట్ మండల పరిధిలో డ్రంకన్ డ్రైవ్ కేసులో ఐదుగురికి న్యాయస్థానం జైలుశిక్ష విధించినట్లు ఎస్సై వినయ్ కుమార్ పేర్కొన్నారు. గ్రామానికి చెందిన టెక్ సాయిలు, గోసం చిన్నయ్య, న్యాల్కల్ గ్రామానికి చెందిన వరికొప్పుల అశోక్‌కు ఐదు రోజులు చొప్పున, సాయిలుకు నాలుగు రోజులు, నవీపేట్ గ్రామానికి చెందిన బొమ్మల రాజుకు మూడు రోజులు జైలు శిక్ష విధించారని ఆయన పేర్కొన్నారు. తాగి వాహనాలు నడపడం చట్టం చట్టరీత్యా నేరం అని.. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Lal Darwaza Bonalu | లాల్‌దర్వాజ బోనాల్లో 116 మంది అనుమానితుల అరెస్ట్