Paidi Rakesh Reddy POCSO | పొక్సో కేసు వ్యక్తిగత వ్యవహారం.. బీజేపీకి సంబంధం లేదు: ఎమ్మెల్యే పైడి రాకేష్ సంచలన వ్యాఖ్యలు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Paidi Rakesh Reddy POCSO | కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ అగ్రనేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఈ కేసుకు, భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బండి భగీరథ్ కేసుపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Paidi Rakesh Reddy POCSO |

బండి భగీరథ్‌పై నమోదైన మైనర్ బాలిక వేధింపుల కేసుపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “బండి భగీరథ్, బాధిత బాలిక ఇద్దరూ గతంలో బావా-మరదళ్ల లాగా ఉండేవారు. వారి మధ్య ఉన్నది వ్యక్తిగతమైన వ్యవహారం. దీనికి తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు” అని వ్యాఖ్యానించారు.

ఈ కేసును పూర్తిగా వ్యక్తిగత కోణంలోనే చూడాలని, రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఆయన కోరారు. బండి సంజయ్ కొడుకుపై వచ్చిన ఆరోపణలకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.

Paidi Rakesh Reddy POCSO | సర్వత్రా విమర్శలు

ఒక మైనర్ బాలికపై జరిగిన లైంగిక వేధింపుల ఆరోపణలు, పొక్సో చట్టం కింద నమోదైన అత్యంత తీవ్రమైన కేసును సమర్థిస్తూ, బాధితురాలిని, నిందితుడిని “బావా-మరదళ్లు” అని సంబోధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక శాసనసభ్యుడు, ఒక మైనర్ బాలికకు జరిగిన అన్యాయాన్ని ఇంత జుగుప్సాకరంగా, తేలికగా మాట్లాడటం సరికాదని మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు.

తెలంగాణ సమాజానికి సంబంధం లేని అంశం అంటూ ఎమ్మెల్యే మాట్లాడటం బాధితురాలిని అవమానించడమేనని నెటిజన్లు సైతం సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారి, రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

Telangana IAS Officers| జాతీయ స్థాయిలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల హవా.. ‘టాప్ 100’ జాబితాలో ముగ్గురికి చోటు

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *