అక్షరటుడే, తెయూ క్యాంపస్: Telangana University Recruitment | తెలంగాణ యూనివర్సిటీలో 2012 నియామక ప్రక్రియ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బాధితుడు వెంకట్ నాయక్ కోరారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యులు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ (Hyderabad)లోని ఆయన స్వగృహంలో శనివారం కలిసి విన్నవించాడు.
Telangana University Recruitment | 2012 నుంచి జరుగుతున్న వ్యవహారంపై..
2012 నుంచి మొదలుకొని ఇప్పటివరకు తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న వ్యవహారాలపై ఆయనకు వివరించినట్లు వెంకట్ నాయక్ తెలిపారు. 13ఏళ్లుగా ప్రభుత్వం నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుందని, సమగ్రంగా విచారించి నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఇటీవల పదోన్నతుల విషయంపై సంబంధిత నియామక ప్రక్రియలో నియామకాలు పొందిన అధ్యాపకులు యూనివర్సిటీ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ, వర్సిటీ ప్రతిష్టను దిగజార్చుతున్నారని వివరించినట్లు పేర్కొన్నారు. స్పందించిన వేం నరేందర్ రెడ్డి… నియామక అంశంపై యూనివర్సిటీ ఉపకులపతి, రిజిస్ట్రార్లతో చర్చిస్తానని, తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు వెంకట్ నాయక్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Tata Sumo Robbery | టాటా సుమోలో వచ్చి దోపిడీ దొంగల హల్చల్.. భయాందోళనలో ప్రజలు..