Medical College Nizamabad | ర్యాగింగ్​ తీవ్రమైన నేరం..: సీపీ సాయిచైతన్య

shashi kiran Mottala
Medical College Nizamabad | ర్యాగింగ్​ తీవ్రమైన నేరం.. : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Medical College Nizamabad | ర్యాగింగ్ (ragging) తీవ్రమైన నేరమని.. దానికి కఠినమైన శిక్షలు ఉంటాయని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. యాంటీ ర్యాగింగ్ (anti ragging), మత్తు పదార్థాల నివారణ, సైబర్ క్రైంపై నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీపీ సాయి చైతన్య ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు.

Medical College Nizamabad | మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం..

మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం అవుతాయని.. పొరపాటున కూడా వాటి జోలికి విద్యార్థులు వెళ్లవద్దని సీపీ సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, జీజీహెచ్​ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​ నాగమోహన్ మాట్లాడుతూ కళాశాలలో ర్యాగింగ్​కు జీరో టాలరెన్స్​ విధానం అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థుల భద్రతకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ర్యాగింగ్, డ్రగ్, (drug abuse prevention) సైబర్ క్రైంలపై (cyber crime awareness) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌ఎన్‌సీసీ, ఈగిల్ సెల్ డీఎస్పీ సోమనాథం, సీసీపీఎస్ ఏసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ ప్రకాశ్​, అడ్వొకేట్​ నారాయణ, వైద్యులు​ జలగం తిరుపతి రావు, కిషోర్, వన్ టౌన్ సీఐ రఘుపతి, కళాశాల సూపరింటెండెంట్​ పెద్దోళ్ల నాగరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

54 1

76 1

ఇది కూడా చదవండి: RTC Protest | ప్రభుత్వ తీరుపై నిరసన.. నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *