అక్షరటుడే, కామారెడ్డి: Electric Shock Death | రుణం తీసుకుని ఉపాధి నిమిత్తం పిండి గిర్ని ఏర్పాటు చేసుకున్న ఓ మహిళ.. ఆ గిర్నిని (flour mill accident) శుభ్రంచేస్తూ విద్యుత్‌షాక్‌తో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన భిక్కనూరు (Bhikkanoor) మండలం పెద్ద మల్లారెడ్డిలో శనివారం చోటు చేసుకుంది.
Electric Shock Death | శుభ్రం చేస్తుండగా..
భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో బండి రేణుక (35) ఉపాధి నిమిత్తం రుణం తీసుకుని చిన్న పిండిగిర్ని ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే శనివారం ఉదయం గిర్ని స్టార్ట్ చేసేముందు నీళ్లుచల్లి శుభ్రం చేస్తుండగా కరెంట్‌షాక్ కొట్టింది. దాంతో ఆమె అక్కడే కిందపడగా తలకు బలమైన గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కామారెడ్డిలో (kamareddy) ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దాంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. మృతురాలి భర్త యోగేష్ గ్రామంలో చికెన్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Nara Lokesh Durga | ఇంద్రకీలాద్రిపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు

