Nizamabad Ganja Seizure | నగరంలో భారీగా గంజాయి పట్టివేత

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Ganja Seizure | నగరంలోని రైల్వేస్టేషన్​లో (Nizamabad Railway Station) భారీగా గంజాయి పట్టుబడింది. ఈ మేరకు ఎక్సైజ్ (Nizamabad Excise)​, ఆర్​పీఎఫ్​ పోలీసులు వివరాలు వెల్లడించారు.

Nizamabad Ganja Seizure | నాగావళి ఎక్స్​ప్రెస్​లో..

సంబల్​పూర్​ నుంచి నాందేడ్ (nanded)​ వెళ్తున్న నాగావళి ఎక్స్​ప్రెస్​లో (Nagavali Express) గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్​, ఆర్​పీఎఫ్​ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్​లో రైలును తనిఖీలు చేసి పొన్నంచంద్​ శంకర్​ రావ్​ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 5.35కిలోల గంజాయిని స్వాధీనం చేసకున్నారు. గంజాయిని విశాఖపట్నం (Visakhapatnam) నుంచి నాందేడ్​కు తీసుకెళ్తున్నట్లు విచారణలో అతడు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టారు. తనిఖీల్లో ఎక్సైజ్​ ఎస్​హెచ్​వో స్వప్న, ఎస్సై మల్లేష్​, సిబ్బంది మోహన్​ సింగ్​, గౌతం, దేవేందర్​, రాజేందర్​ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Bandi Bhageerath Surrender | పోక్సో కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన బండి భగీరథ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *