Visakhapatnam Railway Zone | విశాఖ రైల్వే జోన్​ ఏర్పాటు.. గెజిట్​ జారీ చేసిన కేంద్రం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Visakhapatnam Railway Zone | ఏపీలో విశాఖ రైల్వే జోన్​ను నూతనంగా ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. విశాఖపట్నం (Visakhapatnam) కేంద్రంగా ప్రత్యేక దక్షిణ కోస్తా రైల్వే జోన్​ జూన్ 1 వ తేదీ నుండి అమల్లోకి రానుంది.

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్​లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా (Andhra Pradesh State)నికి సంబంధించిన విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్ లోకి బదిలీ చేయనున్నారు. ఇక పైన దక్షిణ మధ్య రైల్వే జోన్​లో మూడు డివిజన్లు మాత్రమే ఉండనున్నాయి. అవి తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్, హైదరాబాద్​, మహారాష్ట్రలోని నాందేడ్ డివిజన్లు దక్షిణ మధ్య రైల్వేలో ఉంటాయి.

Visakhapatnam Railway Zone | తగ్గిన పరిధి

ఉత్తర తెలంగాణ (North Telangana) ప్రాంతంలోని కాజీపేట కేంద్రంగా నూతన రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగాఉంది. ఒకవేళ కాజీపేట జంక్షన్​ను డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తే ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని రైల్వే కార్యకలాపాలు సాఫీగా సాగుతాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధి, విస్తీర్ణం చాలా పెద్దగా ఉంది. 2026 జూన్‌ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఏర్పాటుతో దక్షిణ మధ్య రైల్వే పరిధి తగ్గనుంది. ఈ జోన్​ ఏర్పాటుపై 2019లోనే కేంద్రం ప్రకటన చేసింది. అయితే ఆ తర్వాత అడుగులు ముందుకు పడలేదు. ఎట్టకేలకు తాజాగా జోన్​ ఏర్పాటు చేస్తూ గెజిట్​ విడుదల చేసింది.

Visakhapatnam Railway Zone | అధికారుల నియాకం

క్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల కోసం ఇప్పటికే అధికారుల నియామకం చేపట్టారు. ప్రిన్సిపల్‌ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజినీర్, ప్రిన్సిపల్‌ చీఫ్‌ పర్సనల్‌ ఆఫీసర్, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారులను ప్రభుత్వం నియమించింది. జీఎం కార్యాలయంలో 1200 మంది సిబ్బంది అవసరం, జోన్‌ అంతటా 17వేల మంది వరకు పని చేయనున్నారు.

ఇది కూడా చదవండి..: APNRTS Rescue Oman| ఒమన్‌లో బాధితురాలికి బాబు భరోసా.. మే 7న స్వగ్రామానికి రానున్న షహ్నాజ్ !

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *