అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nanded Dharmavaram Express | నిజామాబాద్ (Nizamabad) జంక్షన్ మీదుగా నడుస్తున్న 07189/90 నాందేడ్– ధర్మవరం వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలును క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే జోన్ నాందేడ్ డివిజన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రైలు పెద్దపల్లి – వరంగల్ – విజయవాడ – గూడూరు – తిరుపతి – పాకాల మీదుగా ధర్మవరం వెళ్తుంది. క్రమబద్దీకరించిన తర్వాత ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17636/35గా మారింది.
నాందేడ్ –ధర్మవరం వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం నిజామాబాదు జంక్షన్‌కు సాయంత్రం 6:58 గంటలకు వచ్చి 7 గంటలకు బయలుదేరుతుంది. రెండు నిమిషాలు హాల్ట్ సౌకర్యం ఉంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి ఆదివారం ధర్మవరంలో ఉదయం 05:25 గంటలకు బయలుదేరి, తిరుపతి రైల్వే స్టేషన్‌కు ఉదయం 10:30 గంటలకు వచ్చి 10:40 నిమిషాలకు బయలుదేరుతుంది, సోమవారం ఉదయం 4 గంటలకు నిజామాబాదు జంక్షన్‌కు వచ్చి 4:05 నిమిషాలకు బయలుదేరుతుంది.
Nanded Dharmavaram Express | ప్రముఖ ఆలయాల మీదుగా..
ఈ రైలు ద్వారా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని కదిరి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం, తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం, బాసర సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటుగా సిక్కుల పవిత్ర స్థలం నాందేడ్ లోని గురుద్వారా దర్శనం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఈ రైలుకు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో హాల్ట్ లేదు. ఈ ట్రైన్‌కు నిజామాబాద్ జంక్షన్‌తోపాటు ఆర్మూర్ రైల్వే స్టేషన్లో స్టాప్ సదుపాయం కల్పించారు.
Nanded Dharmavaram Express | 20 బోగీలు
నాందేడ్ –ధర్మవరం వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలులో 8 స్లీపర్ బోగీలు, 6 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ బోగీల తో పాటు 4 సాధారణ జనరల్ బోగీలు ఉంటాయి. మొత్తంగా 20 బోగీలు ఉంటాయి. అధికారికంగా ఈ రైలు ఆదివారం ధర్మవరం జంక్షన్లో ప్రారంభం అవుతుంది.
ఇది కూడా చదవండి..: Bandi Bhagirath POCSO | ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వలేం.. బండి భగీరథ్ కేసులో హైకోర్టు స్పష్టం


