Best Mileage Cars | అత్యధిక మైలేజీ ఇచ్చే 5 కార్లు ఇవే!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Best Mileage Cars | అమెరికా – ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు ఇంధన ధరలను పెంచాయి. తాజాగా మనదేశంలోనూ ధరలను పెంచుతూ ఆయిల్ కంపెనీలే నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశంలో నాలుగేళ్లపాటు నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈనెల 15న లీటర్ కు రూ. 3 చొప్పున పెరిగాయి.

క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు ఇప్పట్లో దిగివచ్చే అవకాశాలు లేకపోవడంతో పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. వాహనదారులకు ఇంధన ధరల పెంపు భారమే అయినప్పటికీ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు కాస్త ఉపశమనం కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మైలేజీ ఇచ్చే కార్ల గురించి తెలుసుకుందామా..

Best Mileage Cars | మారుతి సుజుకీ సెలెరియో

ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో మారుతి సుజుకీ సెలెరియో ఉంది. ఇది మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న మోడల్ కూడా. ఈ హ్యాచ్ బ్యాక్ కారు లీటరుకు 26.68 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని ఏఆర్ఏఐ డేటా చెబుతోంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.61 లక్షల నుంచి రూ. 6.73 లక్షల మధ్య ఉంటుంది.

Best Mileage Cars | మారుతి సుజుకీ స్విఫ్ట్

2005లో ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టిన మారుతి సుజుకీ స్విఫ్ట్ (Maruti Suzuki Swift) ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. ఏఆర్ఏఐ క్లెయిమ్ చేసిన దాని ప్రకారం ఆటోమేటిక్ ట్రాన్సిషన్‌లో మైలేజీ లీటరుకు 25.75 కిలోమీటర్లు వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.7.04 లక్షల నుంచి రూ.8.65 మధ్య ఉంది.

Best Mileage Cars | మారుతి సుజుకీ విక్టోరిస్

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకీ నుంచి నుంచి వచ్చిన మిడ్‌సైజ్ ఎస్యూవీ కారు ఇది. ఇది గ్లోబల్ సీ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించబడింది. పెట్రోల్ -హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో పనిచేస్తుంది. ఏఆర్ఏఐ ప్రకారం లీటరుకు 28.65 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 16.38 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Best Mileage Cars | టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్

భారత్‌లో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కార్లలో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఒకటి. ఇది పెట్రోల్ -హైబ్రిడ్ సెటప్‌తో అందుబాటులో ఉంది. ఏఆర్ఏఐ ప్రకారం 27.97 కి.మీ/లీ మైలేజ్ ఇస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 16.72 లక్షల నుంచి మొదలవుతుంది.

Best Mileage Cars | హోండా సిటీ ఈహెచ్ఈవీ

భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్‌లలో ఒకటి. ఈ కారు 27.26 కిమీ/లీ మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 20 లక్షల వరకు ఉంటుంది.

ఇది కూడా చదవండి..: May 16 Gold Rates | అతివలకు శుభవార్త​.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *