అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipality | రోడ్డుపై కూరగాయల విక్రయానికి మున్సిపల్ ఛైర్పర్సన్ పుల్‌స్టాప్ పెట్టారు. కామారెడ్డి (Kamreddy City) పట్టణంలోని సీఎస్ఐ మైదానం ఎదురుగా రోడ్లపైనే కూరగాయాలు విక్రయిస్తున్నారు. ఈ విషయమై.. ‘పట్టణంలో రాత్రిపూట రోడ్డు పక్కనే కూరగాయల విక్రయాలు’ శీర్షికన ఈనెల 11 న ‘అక్షరటుడే’లో(Akshara Today) కథనం ప్రచురితమైంది.
Kamareddy Municipality | స్పందించిన మున్సిపల్ ఛైర్పర్సన్
దీంతో కామారెడ్డి(Kamareddy) మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి స్పందించారు. తైబజార్ నిర్వహిస్తున్న వారితో ఫోన్లో మాట్లాడారు. ప్రధాన రహదారి పక్కన కూరగాయలు విక్రయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్లపై విక్రయాలు నిలిపివేయాలని సూచించారు. సీఎస్ఐ మైదానంలో (CSI Ground) ఎగ్జిబిషన్ (Exhibition) ఏర్పాటుతో కూరగాయలు విక్రయించలేని పరిస్థితిని తైబజార్ నిర్వాహకులు ఛైర్‌పర్సన్‌కు చెప్పగా రోడ్డుకు ఎగ్జిబిషన్‌కు మధ్య చాలా స్థలం ఖాళీగా ఉంటుందన్నారు. అందులో కూరగాయలు విక్రయించేలా చూడాలని సూచించడంతో రోడ్డుపై కూరగాయల విక్రయాన్ని తక్షణమే నిలిపివేశారు. సీఎస్ఐ మైదానంలో కూరగాయల విక్రయానికి రైతులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయమై ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. రైతులకు ప్రమాదం పొంచి ఉన్న విషయంపై తైబజార్ వాళ్లతో మాట్లాడినట్లు తెలిపారు. బిజీ షెడ్యూల్ వల్ల నేరుగా వెళ్లలేకపోయానని, ఫోన్ ద్వారా సమస్య పరిష్కరించినట్టు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Vijayawada Doctor Case | విజయవాడలో సంచలనం.. పెళ్లి విషయం దాచిపెట్టి నర్సును మోసం చేశాడన్న ఆరోపణలు.. వైద్యుడిపై కేసు


