Road Accident | జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 44వ జాతీయ రహదారిపై డిచ్​పల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Road Accident | రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 44వ జాతీయ రహదారిపై డిచ్​పల్లి (Dichpally) వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

Road Accident | నిజామాబాద్​ బోర్గాంనకు చెందిన..

డిచ్​పల్లి ఎస్సై ఆరిఫ్​ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​లోని(Nizamabad) బోర్గాంనకు చెందిన మెట్టు రామ్ ధనుష్​, కచ్చకాయల తేజ బైక్​పై సుద్దపల్లికి వచ్చారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున నిజామాబాద్ వైపు వెళ్తుండగా జాతీయ రహదారిపై (NH44 accident) నాగ్​పూర్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మెట్టు రామ్ ధనుష్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తేజ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం తేజ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: FIFA Stadium Alcohol | ‘మందు’బాబు క్రేజీ ఐడియా.. స్టేడియంలోకి ఫోన్ కవర్‌లో మద్యం తెచ్చిన అభిమాని

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *