Teacher Protest Telangana | ఉపాధ్యాయులపై కాంగ్రెస్​ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నాం : దినేష్​ కులాచారి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Teacher Protest Telangana | విద్యనందించే ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని బీజేపీ(Nizamabad BJP) తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి అన్నారు. విద్యారంగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తపస్(TUPS)​ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద చేస్తున్న ధర్నాకు ఆయన మంగళవారం సంఘీభావం తెలిపారు.

Teacher Protest Telangana | ఉపాధ్యాయులు రోడ్డెక్కాల్సిన దుస్థితి..

అన్నం పెట్టే రైతాంగం వర్షాలు లేక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. విద్యను అందించే ఉపాధ్యాయులు సైతం తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి రావడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని దినేష్​ అన్నారు. రాష్ట్రంలో సుమారు 51 శాతం పీఆర్సీ పెండింగ్‌లో ఉందని.. అలాగే దేశంలోనే మరెక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఆరు డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్​రెడ్డి నేడు సీఎం అయ్యాక విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

Teacher Protest Telangana | మూసీ నది ప్రక్షాళలకు రూ.వేల కోట్లు..

మూసీ నది ప్రక్షాళనకు రూ.వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఉన్న ఆసక్తి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎందుకు లేదని దినేష్​ ప్రశ్నించారు. రాష్ట్రంలో సుమారు రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.4వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఉపాధ్యాయులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ బాగుపడలేదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు కిషన్ రెడ్డి, మధుసూదన్ చారి, వరప్రసాద్, బద్రీనాథ్, కృష్ణవేణి, కవిత తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: లులు మాల్‌లో గన్ కలకలం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *