అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Rural Police | సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న భార్యాభర్తలు గలీజు దందాకు తెరలేపారు. లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బెదిరించి డబ్బుల వసూళ్లకు తెరలేపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని భార్యాభర్తలను కటకటాల వెనక్కి పంపారు. ఈ మేరకు రూరల్ పోలీసులు వివరాలు వెల్లడించారు.
Nizamabad Rural Police | నాందేడ్‌కు చెందిన భార్యాభర్తలు..
రూరల్ పోలీసులు (Rural Police) తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని(Maharashtra) నాందేడ్(nanded) జిల్లా మథ్కేడ్ తాలూకా ముక్రంబాద్ గ్రామానికి చెందిన మంగేష్కర్ గైక్వాడ్, ఉజ్వల గైక్వాడ్ భార్యాభర్తలు. వీరు నగర శివారులోని(Nizamabad City) మాధవ్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న వీరు గలీజ్ దందాకు తెరలేపారు.
ఉజ్వల గైక్వాడ్ రెండు నెలలుగా కంఠేశ్వర్ బైపాస్(Kanteshwar Bypass), ఆర్మూర్ రోడ్డులో నిలబడి ఒంటరిగా బైక్‌పై వెళ్తున్న వారికి సైగలు చేస్తూ దగ్గరికి పిలుస్తుంది. అనంతరం రేటు మాట్లాడుకొని బైక్‌పై అతడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తుంది. అయితే ఆమె భర్త వారిని ఫాలో అవుతూ వెనుక వెళ్తాడు. అక్కడకు వెళ్లాక బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇద్దరూ ఇలా పలు ప్రాంతాల్లో బైక్‌పై వెళ్లేవారిని శృంగారం పేరుతో తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడని కేసు పెడ్తామని బెదిరించి డబ్బులు దండుకున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిఘావేసి ఈనెల 9న భార్యాభర్తలను నగరంలోని గూపన్పల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా నేరం చేసినట్లు వారు ఒప్పుకున్నారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay Comments | నా మీద కుట్ర పన్నారు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

