జాతీయంVijay Resignation | పెరంబూర్ ఎమ్మెల్యేగానే విజయ్.. తిరుచ్చి ఈస్ట్ పదవికి రాజీనామా

Vijay Resignation | పెరంబూర్ ఎమ్మెల్యేగానే విజయ్.. తిరుచ్చి ఈస్ట్ పదవికి రాజీనామా

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే అధినేత విజయ్, తన ఎమ్మెల్యే పదవుల్లో ఒకదానికి రాజీనామా చేశారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Resignation |తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే అధినేత విజయ్, తన ఎమ్మెల్యే పదవుల్లో ఒకదానికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పెరంబూర్ , తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుండి పోటీ చేసి రెండింటిలోనూ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

నిబంధనల ప్రకారం ఒకే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉండటంతో, ఆయన తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన తరపున మంత్రులు సెంగోట్టియన్, వెంకట్రామన్ అసెంబ్లీ కార్యదర్శిని కలిసి రాజీనామా పత్రాన్ని అధికారికంగా సమర్పించారు. ఇకపై ఆయన పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు.

Vijay Resignation | రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు..

చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో విజయ్ తమిళనాడు 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నటి త్రిష వంటి సినీ తారలు కూడా హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Vijay Resignation | తొలి ప్రసంగంలో భావోద్వేగం..

ముఖ్యమంత్రి హోదాలో చేసిన తొలి ప్రసంగంలో విజయ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఒక సాధారణ సినీ దర్శకుడి కుమారుడిగా ప్రయాణం మొదలుపెట్టి, ఎన్నో ఆటంకాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం కొలువుదీరిందని పేర్కొన్న ఆయన, గత ప్రభుత్వ పాలన వల్ల ఖాళీ అయిన ఖజానాను గాడిలో పెట్టేందుకు కొంత సమయం కావాలని ప్రజలను కోరారు. ముఖ్యంగా విద్యార్థుల సంక్షేమం కోసం ‘విజయ్ మామ’గా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతానని, అవినీతికి తావులేని పాలన అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: PM Modi Visit | దేశాభివృద్ధిలో హైదరాబాద్​ పాత్ర కీలకం : ప్రధాని మోదీ

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Siddipet Couple Suicide|సిద్దిపేటలో విషాదం.. పెళ్లైన నెలకే నవ దంపతుల ఆత్మహత్య

అక్షరటుడే వెబ్‌డెస్క్:Siddipet Couple Suicide|ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట నూరేళ్లు...

Nizamabad Rural Police | భార్యాభర్తల గలీజు దందా.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Rural Police | సులభంగా డబ్బు...

Bandi Sanjay Comments | నా మీద కుట్ర పన్నారు.. బండి సంజయ్​ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay Comments | కేంద్ర మంత్రి...