అక్షరటుబే వెబ్‌డెస్క్: General Dhiraj Seth | భారత సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ చేయడంతో, ఆ బాధ్యతలను ధీరజ్ సేథ్ చేపట్టారు. దేశ 31వ ఆర్మీ చీఫ్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ అత్యున్నత పదవిని చేపట్టకముందు, ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా సేవలందించారు.
General Dhiraj Seth | రికార్డు స్థాయిలో నియామకం..
జనరల్ ధీరజ్ సేథ్ నియామకం భారత సైన్యంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. 1997 తర్వాత ‘ఆర్మర్డ్ కోర్’ (టాంక్ రెజిమెంట్) నేపథ్యం నుంచి ఆర్మీ చీఫ్ పదవిని దక్కించుకున్న మొదటి అధికారిగా ఆయన రికార్డు సృష్టించారు.

General Dhiraj Seth | సుదీర్ఘ అనుభవం..
1986 డిసెంబర్లో ‘2వ లాన్సర్స్’ రెజిమెంట్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ధీరజ్ సేథ్‌కు దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ మిలిటరీ అనుభవం ఉంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో అత్యంత కీలకమైన ‘సదరన్ కమాండ్’, ‘సౌత్ వెస్ట్రన్ కమాండ్’ రెండింటికీ కమాండర్‌గా పనిచేసిన అరుదైన ఘనత ఆయన సొంతం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలు, ఐక్యరాజ్యసమితి (UN) శాంతి మిషన్లలో ఆయన చేసిన సేవలకు గాను ‘పరమ విశిష్ట సేవా మెడల్’ (PVSM), ‘ఉత్తమ యుద్ధ సేవా మెడల్’ (UYSM) వంటి పురస్కారాలు లభించాయి.
General Dhiraj Seth | ముందున్న లక్ష్యాలు..
ఆధునిక యుద్ధ తంత్రాలపై పట్టున్న జనరల్ ధీరజ్ సేథ్, భారత సైన్యంలో సాంకేతిక విప్లవం తీసుకురావాలని భావిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ల వినియోగాన్ని మరింత పెంచడం, ‘ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్’ (IBG) రూపకల్పన ద్వారా సైన్యాన్ని మరింత శక్తివంతంగా మార్చడంపై ఆయన దృష్టి సారించనున్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad House Explosion | హైదరాబాద్‌లో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం